చైనాను వణికిస్తున్న ప్రాణాంతక జబ్బు... మరోసారి తప్పదా?

ఈ నేపథ్యంలో మరో అంతుచిక్కని ప్రాణాంతక జబ్బు ఇప్పుడు చైనాను వణికించేస్తుంది.

Update: 2023-11-23 03:58 GMT

చైనా, ప్రాణాంతక జబ్బు... ఈ రెండు పదాలు కలిపి చదివితే ప్రపంచం మొత్తం ఒకేసారి వణికిపోతుందని చెప్పినా అతిశయోక్తి కాదు! ఆ స్థాయిలో చైనా నుంచి వచ్చిన వైరస్ లు ప్రపంచాన్ని వణికించేశాయి. ఆ దెబ్బకు ఇప్పటికీ కోలుకోని దేశాలు, కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో అంతుచిక్కని ప్రాణాంతక జబ్బు ఇప్పుడు చైనాను వణికించేస్తుంది. దీంతో... మరోసారి ప్రపంచానికి ముప్పు తప్పదా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

అవును... ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకున్న కొవిడ్‌ 19 వైరస్‌ చైనా నుంచి వ్యాప్తి చెందిందన్న విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆ దేశాన్ని మరో ప్రాణంతక జబ్బు వణికిస్తోంది. స్కూళ్లకు వెళ్తున్న చిన్నారులు అంతుచిక్కని న్యుమోనియా లక్షణాల బారిన పడుతున్నారు. దీంతో దీనికి సంబంధించిన ఒక నివేదిక సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్‌ సంస్థ తాజాగా చైనాను అప్రమత్తం చేసింది. ఇందులో భాగంగా... ఈ ప్రాణాంతక జబ్బుకు సంబంధించిన ఓ నివేదికను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం చైనాలో ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని.. ఈ జబ్బు ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది అనే విషయంలో స్పష్టత లేదు కానీ... స్కూల్స్ లో మాత్రం స్ప్రెడ్ అవుతుండొచ్చని పేర్కొంది.

తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ను ఆన్ లైన్ వేదికగా పంచుకున్న ప్రోమెడ్‌ సంస్థ... బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్‌, లియనోనింగ్‌ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయని వెల్లడించింది. దగ్గు లేకపోయినప్పటికీ... ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌, శ్వాస సంబంధ ఇబ్బందులు వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారని వెల్లడించింది.

దీంతో ఈ అంతు చిక్కని న్యుమోనియా రకం వ్యాప్తి చెందకుండా స్కూళ్లను యాజమాన్యాలు టెంపరరీగా మూసివేశాయని ప్రోమెడ్‌ సంస్థ ఎక్స్‌ లో ఒక పోస్టు చేసింది. అయితే... ఇది కరోనాలాగా మరో మహమ్మారిగా మారే అవకాశం ఉందా లేదా అనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని.. అయితే ఇది అసాదారణమైన విషయమని అభిప్రాయపడింది.

అవును... ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం, ఒకే రకం లక్షణాలతో ఆస్పత్రుల బాటపట్టడం అసాధారణ విషయమని ప్రోమొడ్ సంస్థ వెల్లడించింది. పిల్లలతోపాటు పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినట్లు వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసినప్పటినుంచీ తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News