పోస్టుమార్టంలో యువతి కళ్లు మాయం... వీడియో అడిగిన మేజిస్ట్రేట్

ఈ పని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది చేశారని వారు ఆరోపిస్తున్నారు! దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

Update: 2023-12-12 13:30 GMT

ఓ యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె కళ్లు మాయమైయ్యాయంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దిగ్భ్రాంతికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ పని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది చేశారని వారు ఆరోపిస్తున్నారు! దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ ఘటనపై జిల్లా మేజిస్ట్రేట్ స్పందించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.

తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌ లో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. ఆమె కళ్లు మాయమైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా మేజిస్ట్రేట్‌.. యువతి మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని తెలిపారు.

వివరాళ్లోకి వెళ్తే... యూపీలోని బదాయు జిల్లా, రసూలా గ్రామంలో ఓ యువతి (20) ఆదివారం ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వరకట్నం కోసం ఆమెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆరోపణలు మొదలయ్యాయి. దీంతో ఆమె భర్తపై డౌరీ కేసు నమోదైంది. ఈ క్రమంలో పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ సమయంలో పోస్ట్ మార్టం పూరయిన అనంతరం ఆమె మృతదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆమె బాడీలో కళ్లు మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారట. పోస్టుమార్టం సమయంలోనే ఈ పని జరిగిందని.. ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై ఆరోపణలు చేశారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ ను ఆశ్రయించారు.

దీంతో స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్‌... ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తామని, ఎవరైనా దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదే సమమయంలో రెండో పోస్ట్‌ మార్టం ప్రక్రియను పూర్తిగా వీడియో తీసి, నివేదిక సమర్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News