ఇటు కూతురికి అటు అల్లుడికి..టీడీపీ పెద్దాయన సూపర్...!
యనమలను ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవించడమే కాదు టీడీపీ అధికారంలోకి వచ్చినపుడల్లా ఆయనే ఆర్ధిక మంత్రిగా ఉంటూ వచ్చారు.
టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామక్రిష్ణుడు పలుకుబడి సూపర్ అని అంటున్నారు. ఆయన చంద్రబాబుల మధ్య ఉన్న అనుబంధానికి ఎన్నో ఉదాహరణలు. యనమలను ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవించడమే కాదు టీడీపీ అధికారంలోకి వచ్చినపుడల్లా ఆయనే ఆర్ధిక మంత్రిగా ఉంటూ వచ్చారు.
చంద్రబాబు తరువాత అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నంబర్ టూ గా వెలిగారు. టీడీపీ ఓడినా బాబుకు కీలక సలహా సూచనలు ఇచ్చే వారిలో యనమలది అత్యంత ముఖ్య స్థానం. ఆయన 2004 తరువాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ సీటు కట్టబెట్టి చంద్రబాబు ఆయన సేవలను చట్ట సభలలో వాడుకుంటూ వస్తున్నారు.
ఇక యనమల సొంత నియోజకవర్గం తుని సీటుని మూడు సార్లు ఆయన తమ్ముడు క్రిష్ణుడికి ఇప్పించుకున్నారు. 2024 ఎన్నికల్లో మొదటిసారి తన కుమార్తె దివ్యకు ఇప్పించారు. అదే టైం లో యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కి మైదుకూరు టికెట్ దక్కింది. ఇది కూడా యనమల ప్రభావమే అని అంటారు.
వీటికి మించి మరో బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈసారి ఆయన అల్లుడికి కూడా టికెట్ ఇప్పించుకోబోతున్నారు. యనమల అల్లుడు మహేష్ యాదవ్ కి ఏలూరు ఎంపీ టికెట్ కన్ ఫర్మ్ అయింది అని ప్రచారం సాగుతోంది. గతంలో మహేష్ యాదవ్ నరసారావుపేట ఎంపీ సీటులో పోటీ చేయలనుకున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లూ చేసుకుని బాగానే వర్క్ చేశారు.
అయితే అనూహ్యంగా ఆ సీటుకు వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ వచ్చారు. బాబు ఆయనకే కన్ ఫర్మ్ చేశారు. దాంతో మహేష్ యాదవ్ సైలెంట్ అయ్యారు. అయితే ఇపుడు ఆయన పేరు ఏలూరు ఎంపీ సీటుకు వినిపిస్తోంది. ఏలూరు ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ నుంచి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుమారుడు సునీల్ పోటీ చేస్తున్నారు.
బీసీ యాదవ్ సామాజిక వర్గానికి ఈ సీటుని ఇవ్వడం ద్వారా వైసీపీ బీసీ నినాదం అందుకుంది. ఇపుడు అదే వరసలో టీడీపీ కూడా బ్యాలెన్స్ చేస్తోంది అని అంటున్నారు. అంగబలం అర్ధబలం దండీగా కలిగిన యనమల అల్లుడిని తెచ్చి ఏలూరు ఎంపీగా పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు.
నిజానికి ఏలూరు ఎంపీ అభ్యర్ధిగా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ గట్టిగా ట్రై చేసుకుంటున్నారు. ఈయన చాలా కాలంగా పార్టీలో ఉన్నారు. తానే ఎంపీ అభ్యర్ధి అని కూడా ఆయన గట్టి విశ్వాసంతో ఉన్నారు. కానీ యనమల చక్రం తిప్పడంతో ఈ సీటు వచ్చి అల్లుడి పరం అయింది అని అంటున్నారు.
ఈ సీటు విషయంలో మహేష్ యాదవ్ అభ్యర్ధిత్వం కోసం చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వేలు చేయించారు అని అంటున్నారు. చివరికి బాబు కూడా సర్వేల ఆధారం చేసుకుని మహేష్ యాదవు పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అంటున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం తెలియడంతో యనమల అల్లుడు ఏలూరు నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.
ఒక వైపు కుమార్తె మరో వైపు అల్లుడు, ఇంకో వైపు వియ్యంకుడు ఇలా చూస్తే కనుక పెద్దాయన యనమల ప్రాధాన్యత టీడీపీలో ఒక లెవెల్ లో ఉంది అని అంటున్నారు. 2025 దాకా ఎమ్మెల్సీగా అవకాశం ఉన్న యనమల టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి ఆర్ధిక మంత్రి అవుతారు అని అంటున్నారు. సో టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి పట్టు పలుకుబడి ఉన్న నేత యనమల అంటున్నారు. ఎనీ డౌట్స్.