అక్కడ ఐదుగురు గెలిస్తే ముగ్గురు మంత్రులు !
అయితే తాజాగా నరేంద్రమోడీ తన మంత్రి వర్గంలో హర్యానా నుండి గెలిచిన ఐదుగురు ఎంపీలలో ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం విశేషం.
హర్యానాలోని 10 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 5 లోక్ సభ స్థానాలు, కాంగ్రెస్ 5 లోక్ సభ స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ కురుక్షేత్ర, కర్నాల్, భావాలు, గుర్గాన్, ఫరీదాబాద్ స్థానాలను గెలుచుకుంది.
అయితే తాజాగా నరేంద్రమోడీ తన మంత్రి వర్గంలో హర్యానా నుండి గెలిచిన ఐదుగురు ఎంపీలలో ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం విశేషం. హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు రావు ఇంద్రజిత్ సింగ్, క్రిష్ణన్ పాల్ గుజ్జర్ లకు మోదీ కేబినెట్ లో చోటు దక్కింది.
రానున్న నవంబర్ నెలతో హర్యానా ప్రభుత్వ గడువు ముగియనుంది. అక్టోబర్ లో శాసనసభ ఎన్నికలు జరగనుండడంతో హర్యానాలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కేంద్ర కేబినెట్ లో ఆ రాష్ట్ర నేతలకు ప్రాధాన్యమిచ్చారని తెలుస్తుంది.
హర్యానా లోని 90 శాసనసభ స్థానాలలో గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 41, మిత్రపక్షాలు 2 స్థానాలలో గెలిచి అధికారం చేపట్టాయి. కాంగ్రెస్ 29, మిగతావి ఇతరులు గెలుచుకున్నారు. ఈ సారి అక్కడ అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది.