ఈ మంత్రులు రాజ్యసభకు నో ఛాన్స్... బీజేపీ లెక్కలివేనా?
ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సందడి ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోనూ నెలకొంది. ఈ సమయంలో లోక్ సభ ఎంపీ సీట్ల సర్దుబాటు కూడా ఈ ఎన్నికల వల్ల కాస్త సులువైందని.. క్లిష్ట సమస్యలకు సులువుగా పరిష్కారం దొరుకుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అవును... బీజేపీనుంచి రాజ్యసభ సభ్యులుగా ఉంటూ కేంద్రమంత్రులుగా ఉన్న ఏడుగురు విషయంలో అధిష్టాణం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... వారిని మరోసారి రాజ్యసభకు నామినేట్ చేయకుంది. దీంతో ఈ విషయం ఆసక్తిగా మారింది. బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరేమైనా కారణం ఉందా.. లేక, వచ్చే ఎన్నికల్లో వీరు లోక్ సభ కు సులువుగా గెలుస్తారనే అతివిశ్వాసం ఏర్పడిందా అనేది కూడా ఆసక్తిగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... దేశంలోని 15 రాష్ట్రాల్లో ఉన్న 56 రాజ్యసభ స్ధానాలకు ఈ నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 27న ఈ కీలక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో... ఈ ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలకు చెందిన పలువురు అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఏడుగురు కేంద్రమంత్రుల్ని మరోసారి నామినేట్ చేయకుండా కీలక నిర్ణయం తీసుకుంది.
వీరిలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, జూనియర్ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్, మత్స్య మంత్రి పుర్షోత్తమ్ రూపాలా, మైక్రో - చిన్న - మధ్యతరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే, జూనియర్ విదేశాంగ మంత్రి వి మురళీధరన్ ఉన్నారు. ఈ ఏడుగురికి ఈసారి రాజ్యసభ టిక్కెట్లు రెన్యువల్ చేయలేదు బీజేపీ అధిష్టాణం.
మరికొన్ని రోజుల్లో లోక్ సభ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రమంత్రులుగా ఉన్న వీరిని కాదని వేరేవారిని బీజేపీ రాజ్యసభకు పంపుతుండటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే... వీరిని లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపబోతోందని తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీకి దేశవ్యాప్తంగా అనుకూల పవనలు వీస్తున్నాయనే ఆలోచనతో ఉన్న అధిష్టాణం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.