అవును వాళ్లిద్దరూ అదరగొట్టారు !

జగన్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవద్దని ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

Update: 2024-06-06 09:21 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ పొత్తు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం అయ్యాడు. జగన్ ను ఓడించాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవద్దని ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు.

తాజా ఫలితాల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. పోటీచేసిన కాకినాడ, మచిలీపట్నం లోక్ సభ స్థానాల్లో 2.20 లక్షల పైచిలుకు ఓట్లతో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. పోటీచేసిన అసెంబ్లీ స్థానాల్లో 13 స్థానాల్లో 40 వేల పై చిలుకు, 5 స్థానాల్లో 30 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించడం విశేషం.

జనసేన మాదిరిగానే బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్) పోటీ చేసిన 5 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి వందశాతం ఫలితాలు అందుకుంది. వైశాలి, హాజీపూర్, సమస్తిపూర్, ఖగారియా, జముయి లోక్ సభ స్థానాల్లో గెలిచింది. నాలుగు స్థానాల్లో లక్ష పైచిలుకు, ఒక స్థానంలో 89 వేల ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం.

Tags:    

Similar News