పార్లమెంట్ లో ముగ్గురు గాంధీలు
ఒకేసారి తల్లీ కొడుకూ కూతురు ఎంపీలుగా ఉన్న హిస్టరీ ఇటీవల కాలంలో లేదు. గతం తరచినా కూడా అది జరిగినట్లుగా లేదు.
ఒకేసారి తల్లీ కొడుకూ కూతురు ఎంపీలుగా ఉన్న హిస్టరీ ఇటీవల కాలంలో లేదు. గతం తరచినా కూడా అది జరిగినట్లుగా లేదు. దేశానికి తొలి ప్రధాని పండిట్ నెహ్రూ హయాంలో ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉండేవారు. అలా తండ్రీ కుమార్తె పార్లమెంట్ లో ఉన్నారు.
ఇక ఇందిరాగాంధీ 1980లో మూడవసారి దేశానికి ప్రధాని అయ్యాక మొదట సంజయ్ గాంధీ అమేథీ నుంచి ఎంపీగా గెలిచారు. అలా తల్లీ కొడుకూ ఒకేసారి లోక్ సభలోనే కనిపించారు. అయితే సంజయ్ గాంధీ అతి తక్కువ సమయమే ఎంపీగా ఉన్నారు.ఆయన 33 ఏళ్ళకే అకాల మృత్యువాత పాడడంతో ఆ ప్లేస్ లోకి రాజీవ్ గాంధీ వచ్చారు.
ఆయన తన తల్లి ప్రధానిగా ఉండగా జస్ట్ల్యే ఎంపీగా ఉన్నారు. 1984లో రాజీవ్ గాంధీ ఇందిర హత్యానంతరం దేశానికి ప్రధాని అయిపోయారు. ఏ మంత్రి పదవీ చేపట్టకుండా ప్రధాని అయిన వారు ఆయనే. కట్ చేస్తే తిరిగి 2004లో మళ్ళీ తల్లీ కొడుకూ లోక్ సభలో ఎంపీలుగా ఒకేసారి కనిపించారు. 1999లో తొలిసారి అమేథీ నుంచి గెలిచిన సోనియా 2004లో తాను రాయబరేలీకి మారి అమేథీలో రాహుల్ గాంధీకి అప్పగించారు. అలా రాహుల్ మొదటిసారి ఎంపీ గా గెలిచి వచ్చారు. ఇలా తల్లీ కొడుకూ 2024 వరకూ అంటే రెండు దశాబ్దాల పాటు పార్లమెంట్ లో కలిసే పనిచేశారు.
ఇపుడు మరో అంకం మొదలైంది. అదే ప్రియాంకం. రాహుల్ గాంధీ చెల్లెలు అయిన ప్రియాంకా గాంధీ వయనాడ్ లోక్ సభ సీటు నుంచి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె గురువారం పార్లమెంట్ లో ఎంపీగా ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమం వీక్షించడానికి సోనియాగాంధీ ప్రత్యేకంగా గ్యాలరీ వద్దకు వచ్చారు. రాహుల్ గాంధీ తన చెల్లెలుని తోడ్కొని మరీ పార్లమెంట్ కి వచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు అయితే ప్రియాంక ఎంపీగా ప్రమాణం చేయడాన్ని ఎంతో హుషారుగా పండుగ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ లోక్ సభ ఎంపీ కావడంతో అక్కడ అన్నా చెల్లెలూ ఇద్దరూ కనిపిస్తారు. ఇక రాజ్యసభలో సోనియాగాంధీ ఉన్నారు. అలా ఒకే పార్లమెంట్ హౌస్ లో తల్లీ ఇద్దరు బిడ్డలూ ఎంపీలుగా ఉండడం అంటే అరుదైన ఘటన అని అంటున్నారు.
ఇందిరాగాంధీ టైం లో కానీ నెహ్రూ టైం లో కానీ ఇలా జరగలేదు అని అంటున్నారు. ఇవన్నీ చూసిన వారు పార్లమెంట్ లో ముగ్గురు గాంధీలు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ప్రియాంకను చూసిన తరువాత కాంగ్రెస్ శ్రేణులలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్ కి ఆమె ఆశాకిరణంగా మారుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ కి గాంధీ కుటుంబమే ఆలంబన. ఆ కుటుంబం అంతా ఇపుడు ఎంపీలుగా ఉన్నారు.
మరి దీనిని చూసి కాంగ్రెస్ శ్రేణులు అంతా సంబరం వ్యక్తం చేస్తూంటే ప్రత్యర్ధి పార్టీలేమో వారసత్వం రాజకీయాలు అంటే ఇవే అని అంటున్నారు. బీజేపీ ఎపుడూ కాంగ్రెస్ అంటే గాంధీల మయం అని అంటుంది. ఇపుడు ఏకంగా పార్లమెంట్ లోనే ముగ్గురు గాంధీలను చూసి తన ఆరోపణలను మరింత బలంగా చేసేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది అని అంటున్నారు.