ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్.. చెప్పింది టైమ్స్ నౌ తాజా సర్వే

విపక్షాలు అదే పనిగా విమర్శలు.. ఆరోపణలతో ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడేక్కిస్తున్న వేళ..

Update: 2023-08-17 04:27 GMT

విపక్షాలు అదే పనిగా విమర్శలు.. ఆరోపణలతో ఏపీ రాజకీయ వాతావరణాన్ని వేడేక్కిస్తున్న వేళ.. అధికారపక్షం తాను చేయాల్సిన పనుల్ని చేసుకుంటూ పోతోంది. ఇప్పుడిదే వైసీపీకి ఆయుధంగా మారనుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే.. అధికార వైసీపీ క్లీన్ స్వీప్ ఖాయమన్న విషయాన్ని తాజాగా జరిపిన సర్వేలో వెల్లడించింది ప్రముఖ ఇంగ్లిష్ మీడియా చానల్ టైమ్స్ నౌ.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్ సభా స్థానాల్ని సొంతం చేసుకునే అవకాశం ఉందన్న విషయంపై ఆ సంస్థ జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో ఏపీలో అధికార వైసీపీ తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన విషయాన్ని వెల్లడించింది. తాజా సర్వేలో సేకరించిన డేటా ప్రకారం విశ్లేషణ చేయగా.. ఏపీలో వైసీపీకి 24-25 స్థానాల్లో ఏకపక్షంగా విజయం సాధిస్తుందన్న విషయాన్ని వెల్లడించింది.

జూన్ 15- ఆగస్టు 12 మధ్యలో తాము చేసిన తాజా సర్వేలో ఈ విషయం బయటపడినట్లుగా పేర్కొంది. ఇదే సంస్థ ఏప్రిల్ లోనూ సర్వే నిర్వహించింది. అప్పుడు కూడా ఏపీలో అధికారపక్షానిదే అధిక్యమని పేర్కొంది. అయితే.. అప్పటికి.. తాజాగా చేసిన సర్వేకు మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందని.. హవా మాత్రం అధికారపార్టీదేనని స్పష్టం చేసింది. సదరు చానల్ వెల్లడించిన ప్రకారం చూస్తే.. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా.. వైసీపీకి 24-25 స్థానాలు.. విపక్ష టీడీపీకి 0-1 స్థానం.. జనసేన.. బీజేపీకి ఏ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం లేదని స్పష్టం చేసింది.

2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి 51.3 శాతం ఓట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడా పార్టీకి 1.5 శాతం పెరగనున్న విషయాన్ని వెల్లడించింది. దీంతో.. విపక్షాలు చేసే విమర్శల్ని ప్రజలు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదన్న విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News