టైటాన్ సబ్ మెరైన్ లో ప్రయాణికుల చివరి మాట, ఫోటో ఇవే!

అయితే ఈ ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు తాజాగా బయటకు వచ్చాయి.

Update: 2024-09-17 05:20 GMT

అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 111 ఏళ్ల కిందట మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో కూడిన "టైటాన్" సబ్ మెరైన్ న్యూఫౌండ్ ల్యాండ్ నుంచి బయలుదేరి వెళ్లిన ప్రయాణం విషాదాంతమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు తాజాగా బయటకు వచ్చాయి.

అవును... టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్ మెరైన్ కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఈ టైటాన్ సబ్ మెరైన్ లో బయలుదేరిన పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ హమీష్ హార్డింగ్, నేవీ మాజీ అధికారి పాల్ హెన్రీ, ఓషన్ గేట్ ఫౌండర్ స్టాక్టన్ రష్ లు మరణించారు.

ఈ సమయంలో నీటి లోపల పీడనం పెరగడం వల్ల సబ్ మెరైన్ పేలిపోయి అందులోని ఐదుగురు పర్యాటకులు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సహాయంతో ఈ టైటాన్ శకలాలను గుర్తించినట్లు పేర్కొంది. టైనానిక్ నౌక సమీపంలో 488 మీటర్ల దూరంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ తెలిపారు.

అయితే ఈ ప్రమాదంపై తాజాగా న్యాయ విచారణ మొదలైంది. ఈ క్రమంలోనే టైటాన్ సబ్ మెరైన్ ప్రమాదానికి ముందు అందులోని ప్రయాణికులు చెప్పిన చివరి మాటలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... "అంతా బాగానే ఉంది" అనే మూడు పదాలను వారు చెప్పినట్లుగా విచారణ బృందం తెలిపింది!

ఇదే సమయంలో ఈ ప్రమాదానికి సంబంధించిన చివరి ఫోటో కూడా బయటకు వచ్చింది. ఓ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ ఈ చిత్రాన్ని తీసినట్లు విచారణ బృందం వెల్లడించింది.

Tags:    

Similar News