ట్రెండింగ్ టాపిక్... విమానంలో సెక్స్!

వివరాళ్లోకి వెళ్తే... యూకేలోని లూటన్ నుంచి స్పెయిన్ లోని ఇబిజా వెళ్తున్న ఈజీ జెట్ విమానంలో ఓ జంట వాష్ రూం లోకి వెళ్లి గడియ పెట్టుకుంది.

Update: 2024-06-14 00:30 GMT

ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో వెలుగుచూస్తున్న పలు ఘటనలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికుల వింత ప్రవర్తన, విచిత్రపు చేష్టలు అసభ్యకరంగా ఉంటున్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా "అంతకు మించి" అన్నట్లుగా ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... విమానంలో ప్రయాణిస్తున్న సమయలో దుస్తులు తీసేసి నగ్నంగా నడవడం, పక్క సీట్లో మహిళలు ఉన్నప్పుడు పురుషాంగాన్ని ప్రదర్శించడం, సీట్లలోనే మల మూత్ర విసర్జనలు వంటి అసభ్యకరమైన ఎన్నో ఘటనలు ఇప్పటివరకూ తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో ఇప్పుడు చెప్పుకోబోయే విషయం మాత్రం వీటన్నింటినీ తలదన్నిన ఘటనగా వైరల్ అవుతుంది.

వివరాళ్లోకి వెళ్తే... యూకేలోని లూటన్ నుంచి స్పెయిన్ లోని ఇబిజా వెళ్తున్న ఈజీ జెట్ విమానంలో ఓ జంట వాష్ రూం లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. అయితే ఎంతసేపటికీ వీరిద్దరూ బయటకు రావడం లేదు. దీంతో విషయం గ్రహించిన సిబ్బంది... బాత్రూం డోర్ దగ్గరకు వెళ్లి.. "ఎనీ ప్రాబ్లం" అని ఆరా తీశారు. అయితే లోపల నుంచి సమాధానం రాలేదు కానీ.. కాసేపటికి ఆ టాయిలెట్ డోర్ మాత్రం ఓపెన్ అయ్యింది.

దీంతో ఏమై ఉంటుందనే ఆత్రుతతో చాలా మంది అటువైపు చూడగా... వాళ్లిద్దరూ కింద ఫ్యాట్లు లేకుండా ఏదో "పని"లో ఉన్నట్లు కనిపించారు. ఇంతలోనే ఆ యువకుడు డోర్ వేసేసుకున్నాడు. దీంతో విమాన సిబ్బంది షాక్ కి గురవ్వగా... తోటి ప్రయాణికుల్లో కొంతమంది నవ్వుకోగా.. మరికొంతమంది అసహ్యించుకుంటున్నట్లు ఎక్స్ ప్రెషన్ పెట్టారు!

ఈ గ్యాప్ లో మరొకరు మరింత ఉత్సాహంతో ఈ ఘటనను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే ఈ ఘటనపై విమాన సిబ్బంది మాత్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విమానం ల్యాండ్ అవ్వగానే వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారట! అయితే ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిందని అంటున్నారు!

Tags:    

Similar News