వామ్మో... ట్రంప్ విజయం సాధిస్తే భారత్ కు ఇన్ని కష్టాలా?
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతుంది. నవంబర్ 5న అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో.. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లలో ఎవరు అధ్యక్షులైతే భారత్ కు అటువైపు నుంచి కాస్త అనుకూల పవనాలు వీచే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. గతంలో భారత్ ను ‘సుంకాల రాజు’ అని, ఇటీవల భారత్ ను సుంకాలతో కొడతానంటూ వ్యాఖ్యానించిన ట్రంప్ విజయం సాధిస్తే భారత్ పై ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై ఫిలిప్ క్యాపిటల్ అనే సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.
ఇందులో భాగంగా... ట్రంప్ విజయం సాధిస్తే...
వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయి.. ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయి. దీంతో ఇబ్బందులు తగ్గించుకోవడానికి కంపెనీలు స్థానికులనే నియమించుకునే పరిస్థితులు నెలకొంటాయి.
ఆటోమొబైల్ రంగంలో భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు తగ్గుముఖం పట్టొచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఇన్సెంటివ్ లను తగ్గించే అవకాశం ఉండటంతో భారత్ నుంచి ఎగుమతయ్యే స్పేర్ పార్ట్స్ కి కొంతకాలం ప్రతికూల ప్రభావం ఉండొచ్చు.
ట్రంప్ అత్యధికంగా శిలాజ ఇంధనానికే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి.. అమెరికాలో ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరిగి, ప్రపంచ వ్యాప్తంగా వాటి ధరలు పడిపొవచ్చు!
ఇండో-ఫసిఫిక్ వ్యూహానికి ట్రంప్ మద్దతు తెలుపుతున్నారు కాబట్టి.. ట్రంప్ ఆయుధ విక్రయాల వంటి లావాదేవీలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈ సమయంలో చైనాపై ట్రంప్ టారీఫ్ యుద్ధం మొదలుపెడితే.. అది భారత సంస్థలకు సరికొత్త అవకాశాలను తెచ్చిపెట్టోచ్చు.
ఫలితంగా.. ఆటోమొబైల్ విడిభాగాలు, టెక్స్ టైల్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు అమెరికా మార్కెట్లోకి బలంగా వెళ్లేందుకు మార్గం లభిస్తుంది!
అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందంటూ ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన ట్రంప్... తాను గెలిస్తే భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాల భారం పెచుతామని ప్రకటించారు.
"అమెరికా ఫస్ట్" అనే విధానంతో ట్రంప్ ముందుకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నందున.. ఇది భారత సమాజానికి కాస్త క్లిష్ట పరిస్థితులను సృష్టించినా ఆశ్చర్యపోనక్కరదు!