క్ష‌ణికావేశం.. అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని దూరం చేస్తోందా?

ఆయ‌న అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఇలా అనే కంటే..పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ అంటే.. అంద‌రికీ ఎక్కువ‌గా గుర్తుంటుంది.

Update: 2023-12-30 09:30 GMT

ఆయ‌న అమెరికా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఇలా అనే కంటే..పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ అంటే.. అంద‌రికీ ఎక్కువ‌గా గుర్తుంటుంది. ఎప్పుడు ఎక్క‌డ ఏం మాట్లాడాలో అంత‌కు మించి.. లేదా.. అంత‌క‌న్నా దారుణంగా వ్యాఖ్య‌లు చేస్తూ.. నిత్యం మీడియాలో ఉన్న నాయ‌కుడు. ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే.. ఆయ‌న క్ష‌ణికావేశ‌మే ఇప్పుడు ఆయ‌న‌కు పెద్ద‌చిక్కుగా మారింది. ప్ర‌పంచ దేశాల్లోనే పెద్ద పీఠంగా భావించే అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని ఆయ‌న‌కు దూరం చేసేలా ఉంది.

ఏం జ‌రిగింది..

ప్ర‌స్తుతం డొనాల్డ్ ట్రంప్‌.. వ‌చ్చే 2024లో జ‌ర‌గ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బ‌లమైన నాయ‌కుడిగా బ‌రిలో దిగ‌నున్నారు. రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌ఫున ఏక‌గ్రీవంగా ఎన్నిక‌లైన అభ్య‌ర్థి కూడాట్రంపే కావ‌డం గ‌మ‌నా ర్హం. దీంతో రాష్ట్రాల స్థాయిలో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రాష్ట్రాల్లో గెలుపు గుర్రం ఎక్కిన వారే.. అధ్య‌క్ష పోటీకి అర్హుల‌వుతార‌నే విష‌యం తెలిసిందే. అయితే.. అనూహ్యంగా ట్రంప్ క్ష‌ణికావేశం.. ఆయ‌న‌కు ఇప్పుడు చుక్క‌లు చూపిస్తోంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. అమెరికా సుప్రీంకోర్టు నిర్ణ‌యంపైనే ట్రంప్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు, అధ్య‌క్ష పీఠం రెండూ ఆధార‌ప‌డి ఉన్నాయి.

అనర్హ‌త వేటు..

2020లో జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓడిపోయి.. డెమొక్రాట్ల అభ్య‌ర్థి జో బైడెన్ గెలుపు గుర్రం ఎక్కిన విష‌యం తెలిసిందే. అయితే.. త‌న ప‌రాజ‌యాన్ని జీర్ణించుకోలేక పోయిన ట్రంప్.. త‌న పార్టీ వారిని రెచ్చ‌గొట్టారు. దీంతో వారంతా సామూహికంగా వెళ్లి 2021లో వైట్ హౌస్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. దీనిలో ట్రంప్ ప్ర‌మేయం ఉంద‌ని, ఆయ‌న రెచ్చ‌గొట్టి హింస‌ను ప్రేరేపించార‌ని.. అధికారులు తేల్చారు.

ఇదే.. ఇప్పుడు ట్రంప్‌కు గుదిబండ‌గామారింది. కొల‌రాడో రాష్ట్రంలో ట్రంప్ పోటీ పై కొంద‌రు ఇక్క‌డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దీనిని విచారించిన కోర్టు.. దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లేలా ఆందోళ‌న కారుల‌ను రెచ్చ‌గొట్టిన ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోపోటీకి అన‌ర్హుడ‌ని తేల్చేసింది. అంతేకాదు.. రాష్ట్రంలో నిర్వ‌హించిన ప్రాథ‌మిక బ్యాలెట్ పోరులో ఆయ‌న పోటీ చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. ఇదితొలిల దెబ్బ‌.

ఇక‌, తాజాగా మైన్ రాష్ట్రంలోనూ.. ఎన్నిక‌ల అధికారి ఇదే నిర్ణ‌యం తీసుకున్నారు. మైన్ రాష్ట్రంలో నిర్వ‌హించే ప్రాథ‌మిక బ్యాలెట్ పోరులో ట్రంప్‌ను పోటీ చేయ‌కుండా.. నిషేధం విధించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ట్రంప్ పోటీ ఆగిపోయింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన ట్రంప్ ఈ రెండు నిర్ణ‌యాల‌ను స‌వాల్ చేశారు. అయితే.. అమెరికారాజ్యాంగంలోని 14వ స‌వ‌ర‌ణ‌లో ఉన్న‌3వ సెక్ష‌న్ ప్ర‌కారం.. విధ్వంసాల‌ను ప్రోత్స‌హించేవారికి ప్ర‌జాప్రాతినిధ్యం ఇవ్వ‌రాద‌నే క్లాజు ఉంది.

దీనిని క‌నుక సుప్రీంకోర్టు స‌మ‌ర్థిస్తే.. ట్రంప్‌కు పూర్తిగా గేట్లు మూసుకుపోతాయ‌ని అంటున్నారు న్యాయ‌నిపుణులు. ఇక్క‌డ దొడ్డి దారులు ఉండ‌వ‌ని కూడా చెబుతున్నారు. ఇదీ.. సంగ‌తి. క్ష‌ణికావేశం..త‌న ఓట‌మిని అంగీక‌రించ‌లేని ప‌రిస్థితి వంటివి ట్రంప్‌ను ఇప్పుడు నిలువును ద‌హించి వేస్తోంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News