ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్... రూ.2,500 కోట్లు రీయింబర్స్!
అవును... ఏపీలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఓ కీలక అడుగు ముందుకేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆస్తులు, అర్థిక లావాదేవీలపై ఇప్పటికీ పూర్తి క్లారిటీ రాలేదని.. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎవరి స్థాయిలో వారు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారనే కామెంట్లు 2014 నుంచి వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... ఏపీలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విభజన సమస్యల పరిష్కారం విషయంలో ఓ కీలక అడుగు ముందుకేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గత నెలలో ఆయన హైదరాబాద్ లో తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల పర్యావసానంగా ఫలితాలు తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి రూ.2,500 కోట్ల మేర దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను క్లియర్ చేసింది! అయితే... ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుందని తెలుస్తోంది.
గతంలో హైదరాబాద్ లోని ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం విదేశీ రుణాలూ తీసుకున్నారు! అయితే వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరగడంతో.. "ఆంధ్రప్రదేశ్" పేరుతో ఉన్న అకౌంట్స్ కు ఆ రుణాలు రావడంతో వాటికి సంబంధించిన వడ్డీ, అసలు ఏపీ ప్రభుత్వమే కడుతోంది.
అయితే ఇందులో 42% ఏటా తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. అలా చెల్లించేలా కేంద్రం కూడా చూడాలి! అయితే... గత పదేళ్లలో కేసీఆర్ సర్కార్ కట్టలేదు. దీంతో గత పదేళ్లకు సంబంధించిన రూ.2,500 కోట్లు ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి అందాయి!