సైకిలెక్కనున్న తాడికొండ ఎమ్మెల్యే....?

కానీ ఆమె సడెన్ గా తన భర్తతో కలసి శ్రీకాకుళం లో పర్యటిస్తున్న చంద్రబాబుని తాజాగా కలవడం చర్చనీయాంశం అయింది.

Update: 2023-08-10 14:54 GMT

ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రాజకీయం మారుతోంది. ఇక రాజకీయ నాయకులు కూడా వచ్చే ఎన్నికల కోసం టికెట్ల వేట మొదలెట్టారు. వైసీపీ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తాడికొండ మహిళా శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఆరు నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారు అన్న కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆమె ఇపుడు టెక్నికల్ గా ఆమె ఎమ్మెల్యేగానే ఉన్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి చూస్తున్నారు. ఆమె వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కొత్తలలో జనసేన తరఫున పోటీ చేస్తారని వినిపించింది. కానీ ఆమె సడెన్ గా తన భర్తతో కలసి శ్రీకాకుళం లో పర్యటిస్తున్న చంద్రబాబుని తాజాగా కలవడం చర్చనీయాంశం అయింది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆమె పోటీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అందుకోసమే ఆమె బాబుని కలిశారు అని అంటున్నారు. మరి బాబుతో ఏమి మాట్లాడారు అన్నది తెలియడంలేదు, ఇక ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి వస్తే ఆమెకు తాడికొండ సీటు దక్కుతుందా అన్న చర్చ కూడా ఉంది. అక్కడ ఇంచార్జిగా మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు.

ఆయాన్ 2014లో గెలిచారు. 2024లో కూడా తానే పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారు. అయితే ఇపుడు ఉండవల్లి శ్రీదేవి టికెట్ అడిగితే శ్రావణ్ కుమార్ కి ఎక్కడ అకామిడేట్ చేస్తారు అన్నది చర్చగా ఉంది. ఇంకో వైపు నుంచి చూస్తే 2004, 2009లలో రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ వైసీపీ అభ్యర్ధిగా ఉంటారని అంటున్నారు.

ఆయన్ని ఢీ కొట్టాలంటే టీడీపీ ఎవరిని అభ్యర్ధిగా నిలబెడుతుఇందో చూడాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ చేసినట్లుగా ప్రచారంలో ఉన్న నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలలో ముగ్గురు ఈసరికే టీడీపీకి సన్నిహితంగా మారిపోయారు. అందులో ఇద్దరికి టికెట్ కన్ ఫర్మ్ అని అంటున్నారు.

ఇపుడు ఉండవల్లి శ్రీదేవి కూడా బాబుని కలవడంతో ఆమెకు టికెట్ ఇచ్చి న్యాయం చేస్తారా అన్నదే చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే ఎన్నికల వేళ వారు వీరూ అటూ ఇటూ మారుతూ ఉంటారు. టికెట్ కోసం సొంత పార్టీలోనూ బయట నుంచి వచ్చిన వారితోనూ అన్ని పార్టీలలో పోటీ ఒక లెవెల్ లో ఉంటుంది టీడీపీలో ఇపుడు ఆ సందడి అయితే కనిపిస్తోంది.

Tags:    

Similar News