యూపీలో ఆపరేషన్ బేడియా.. తోడేళ్లను పట్టుకునేందుకు పెద్ద స్కెచ్

తోడేళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లా అధికారులు వినూత్న ప్రయోగానికి తెరలేపారు.

Update: 2024-09-02 21:30 GMT

తోడేళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు ఉత్తరప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లా అధికారులు వినూత్న ప్రయోగానికి తెరలేపారు. ఆ జిల్లాలో తోడేళ్ల బెడద ఎక్కువైంది. చిన్న పిల్లలను బలితీసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఏకంగా 8 మందిని బలితీసుకున్నాయి. వారిలో మూడేళ్ల చిన్నారి సైతం ఉండడం గమనార్హం. అందుకే.. ఆ జిల్లాలో ఆపరేషన్ బేడియా (మన భాషలో తోడేలు) చేపట్టారు. ఇందుకు కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు.

తోడేళ్లను అడ్డుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నా అవి పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. ఆదివారం రాత్రి సైతం వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఓ చిన్నారిని చంపేయగా.. మరో ఇద్దరు మహిళలను గాయపరిచాయి. నిత్యం రాత్రి సమయాల్లో చిన్నారులపై దాడులకు పాల్పడి ఉదయం వేళ గుహలకు చేరుతున్నాయి. ఎప్పుడైతే అధికారులు వాటిపై నిఘా పెడుతున్నారో.. అదే సమయంలో అవి తమ స్థావారాలను మారుస్తున్నాయంట.

ఇక తోడేళ్ల సంచారంతో అక్కడి నక్కలు ఇబ్బందులు పడుతున్నాయి. తోడేళ్లుగా భావించి ప్రజల చేతిలో నక్కలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. బిహార్ రాష్ట్రంలోని మక్సూద్పూర్ ప్రాంతంలో స్థానికులు ఓ నక్కను తోడేలుగా భావించి హతమార్చారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కలను తోడేళ్లుగా భావించడం సరికాదని సూచించారు.

ఇక ఈ దారుణాలకు చెక్ పెట్టేందుకు స్వయంగా అధికారులు రంగంలోకి దిగారు. తోడేళ్లను పట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా చిన్నారుల మూత్రంతో తడిపిన రంగురంగుల బొమ్మలను తోడేళ్లకు ఎరగా వేస్తుండడం గమనార్హం. ఇలా ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను అధికారులు పట్టుకున్నారు. మరో రెండింటిని పట్టుకోవాల్సిన ఉందని చెబుతున్నారు. వాటిని సైతం పట్టుకునేందుకు డెన్లు, నది పరివాహక ప్రాంతాల్లో రంగురంగుల బొమ్మలను ఏర్పాటు చేవారు. ఆ బొమ్మలను చిన్నారుల మూత్రంతో తడిపారు. వాటి వాసన చూసిన తోడేళ్లు మనిషిలాగా భ్రమించి.. ఉచ్చులో చిక్కుకుంటున్నాయి. అలా ఆ మిగితా రెండింటిని సైతం త్వరలోనే పట్టుకుంటామని అటవీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News