జనవరి 22 : బర్త్ రికార్డ్ లో రీ సౌండ్ చేయబోతోందిట...!

దాంతో యూపీలో రాముడి విగ్రహాలు ఆలయంలో ప్రతిష్టాపన రోజు అయిన 22న ప్రసవాలు చేసుకోవడానికి డేట్ ని నిర్ణయించుకుంటున్నారు. సరిగ్గా ఆ రోజునే బిడ్డను కనాలని తల్లులు ఆరాటపడుతున్నారు.

Update: 2024-01-07 01:30 GMT

జనవరి 22కి ఉన్న విశేషం ఏమిటి అంటే చాలా పెద్దదే అని చెప్పాలి. హిందూ ధర్మం విశ్వసించే వారికి హైందవ మతస్తులకు శ్రీరాముడు ఆరాధ్య దేవుడు. ఆయనకు ఒక గుడి ఉంది అది ఆయన పుట్టిన చోట అయోధ్యలో ఉంది. కానీ సుమారు అయిదు వందల ఏళ్ల నాడు దాన్ని అప్పటి రాజులు కూల్చేశారు.

ఆ ప్లేస్ కోసం రాముడు కోవెల కోసం వందల ఏళ్ల పోరాటం సాగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన ఏడున్నర పదుల దాకా ఈ సమస్య అలాగే ఉంది. మొత్తానికి అది తీరింది. రాముడికి భవ్యమైన దివ్యమైన ఆలయం నిర్మాణం జరిగింది. దాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు.

ఆధ్యాత్మికంగా అది పర్వదినం. పవిత్ర దినం. దాంతో యూపీ సహా ఉత్తరాది ఊగిపోతోంది. అంతకంటే మంచి రోజు ఆధునాతన భారతీయ చరిత్రలో మరొకటి లేదని ఆధ్యాత్మిక వాదులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటిదాకా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన రోజు అంటే శ్రీరామ నవమినే జరుపుకునే వారు. అది పురాణేతిహాసాల నుంచి వస్తున్న సంప్రదాయం.

ఆధునిక భారతం కొత్త పురాణ చరిత్రను సృష్టించింది. శ్రీ రాముడి ఆలయం నిర్మాణం చేసి ప్రారంభిస్తున్న జనవరి 22ను కూడా పురాణేతిహాసాలలో అత్యంత పవిత్ర దినంగా మార్చింది. దాంతో ఆ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే కాదు పుణ్య ఫలం అని అంతా భావిస్తున్నారు.

దాంతో యూపీలో రాముడి విగ్రహాలు ఆలయంలో ప్రతిష్టాపన రోజు అయిన 22న ప్రసవాలు చేసుకోవడానికి డేట్ ని నిర్ణయించుకుంటున్నారు. సరిగ్గా ఆ రోజునే బిడ్డను కనాలని తల్లులు ఆరాటపడుతున్నారు. దాంతో ఆసుపత్రులు అన్నీ కూడా జనవరి 22న ప్రసవాలలో సరికొత్త రికార్డునే క్రియేట్ చేయబోతున్నాయని అంటున్నారు.

ఇప్పటికే తొమ్మిది నెలలు నిండిన వారు సైతం మరి కొన్ని రోజులు వెయిట్ చేయడానికి సిద్ధపడుతుండగా నెలలు నిండుతున్న వారు ఆ రోజునే కనాలని నిర్ణయించుకున్నారు. అలా అదే తేదీన ప్రసవం జరిగేలా చూడాలని వైద్యులను కోరుతున్నారు. ఇది అతి పెద్ద వార్తగా కూడా పాకిపోతోంది.

ఇక జవరి 22 2024 అన్నది అతి పెద్ద పవిత్ర దినం అని హిందూ మతాన్ని విశ్వసించేవారు అంతా నమ్ముతున్నారు. తమకు పుట్టిన బిడ్డలకు రాముడు పేరు కలసి వచ్చేలా పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. సో అలా కనుక చూసుకుంటే జనవరి 22న రికార్డు స్థాయిలో ప్రసవాలు ఉండడమే కాదు పుట్టే వారు అందరి పేర్లూ కూడా రామ శబ్దంతోనే రావడం గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News