భారత్ అలర్ట్... అత్యవసరంగా విమానాల తనిఖీలు స్టార్ట్!

దీంతో... డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అప్రమత్తమైంది.

Update: 2023-12-31 12:30 GMT

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల విషయంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఆందోళనకరమైన సమాచారం నేపథ్యమో భారత్ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా... ఇప్పటికే ఈ విమానాలను ఉపయోగిస్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌, స్పైస్‌ జెట్‌ సంస్థలతో మాట్లాడింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.

అవును... ఇటీవల బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల విషయంలో వెలుగులోకి వచ్చిన బోల్టులు, నట్లుకు సంబంధించిన వ్యవహారం బిగ్ న్యూస్ గా మారింది. దీంతో... డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ అప్రమత్తమైంది. ఇదే సమయంలో అమెరికాలోని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్.ఏ.ఏ), బోయింగ్‌ తో తాము టచ్‌ లో ఉన్నట్లు వెల్లడించింది.

వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల రెండు 737 మ్యాక్స్‌ విమానాల్లో కీలకమైన భాగంలో బోల్టులకు నట్లు లేవని గుర్తించారు. ఇందులో భాగంగా... విమానం పనితీరును నియంత్రించే కీలకమైన రడ్డర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో ఈ లోపాన్ని గుర్తించినట్లు ఓ విమానయాన సంస్థ వెల్లడించింది! ఇదే సమయంలో ఇంకో విమానంలో ఈ బోల్ట్‌ లను సరిగా బిగించలేదని గమనించింది.

దీంతో అలర్ట్ అయిన డీజీసీఏ... బోయింగ్‌, ఎఫ్‌.ఏ.ఏ తో సంప్రదింపులు జరుపుతున్నామని.. సమస్య నివారణకు బోయింగ్‌ చెప్పిన చర్యలను విమానాల ఆపరేటర్లు చేపడతారని వెల్లడించింది. ఇదే సమయంలో ఆకాశ్ ఎయిర్ ప్రతినిధి మాట్లాడుతూ... తమకు బోయింగ్‌ నుంచి సమాచారం అందిందని, ఆ సూచనలను తాము పాటిస్తామని వెల్లడించారు.

కాగా... 737 మ్యాక్స్‌ విమనాల్లో లోపాలను గుర్తించడంతో బోయింగ్‌ అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ రకం 1,370 విమానాల్లో ఇలాంటి సమస్య ఏదైనా ఉందేమో ఆయా విమానయాన సంస్థలు సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా... ఐదేళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News