స్వింగ్ స్టేట్స్‌లో పోటాపోటీ.. అమెరికాలో గెలుపెవరిది..?
అమెరికా ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అగ్రరాజ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
అమెరికా ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అగ్రరాజ్యంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీ కనిపిస్తోంది. మరోవైపు.. కీలకమైన స్వింగ్ స్టేట్ల మద్దతు ఎవరికనే అంశంపై ఇప్పుడు అంతటా ఉత్కంఠ నెలకొంది. ఏడు రాష్ట్రాలను స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ఆ రాష్ట్రాలే అధ్యక్షుడిని నిర్ణయించబోతున్నాయి.
అమెరికాలోని ఏడు స్వింగ్ స్టేట్స్‌లో కొన్ని రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీకి, మరికొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయి. ఇక్కడ తరచూ ఇలానే జరుగుతోంది. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం మార్పు లేకుండా తీర్పు ఇస్తే ట్రంప్‌కు 219 కంటే కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ దక్కుతున్నాయి. అయితే.. ఇప్పుడు మెజార్టీ మార్క్ కోసం ఇద్దరు అభ్యర్థులు ఈ ఏడు రాష్ట్రాలైన స్వింగ్ స్టేట్స్ పై ఆధారపడాల్సి వస్తోంది. ఏడు స్వింగ్స్ స్టేట్లు అయిన పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవాడా, అరిజోనా, మిషిగన్ రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.
ఈ స్వింగ్ స్టేట్లలో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజీ తమ చివరి పోల్స్ సర్వేను వెల్లడించింది. దీని ప్రకారం స్వింగ్ స్టేట్‌లలో ట్రంప్‌పై హారిస్ స్వల్ప ఆధిక్యతను కనబరుస్తున్నారు. అరిజోనాలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియాలో ఇద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నట్లుగా వెల్లడైంది. మరోవైపు.. తెలుగువారు అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా విధానాల్లో మార్పులను కోరుకుంటున్నారు. హెచ్-1బీ వీసాల జారీని సులభతరం చేస్తే దానిని పొందే వ్యక్తి అతడి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నేరుగా అమెరికాకు వెళ్లచ్చు. ఇతరత్రా అనుమతులు అవసరం ఉండవు. తాత్కాలిక వర్క్ పర్మిట్‌ను మంజూరు చేసి ఆదుకోవాలని భారతీయులు కోరుతున్నారు.
ఇక.. అగ్రదేశంలో సెలెబ్రెటీలు, బిజినెస్ టైకూన్స్ ఎవరి వైపు అన్న చర్చ నడుస్తోంది. హాలీవుడ్ సెలెబ్రెటీల నుంచి బిజినెస్ వారు ట్రంప్‌నకు మద్దతు తెలుపుతున్నారా.. హారిస్ వైపు నిలుస్తున్నారా అనేది ఆసక్తి నెలకొంది. బియాన్స్, టేలర్, స్విఫ్ట్, జెన్నిఫర్ లోపేజ్.. అవేంజర్స్ గ్రూపు అంతా కూడా కమలా హారిస్ వైపే ఉన్నారు. అటు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, కిడ్ రాక్, హాల్క్ హోగన్ వంటి సెలెబ్రెటీలంతా కూడా ట్రంప్‌నకు సపోర్టు చేస్తున్నారు. దీంతో అమెరికా ఎన్నికల్లో స్టార్ వార్ కూడా నడుస్తున్నట్లుగా అర్థం అవుతోంది.