ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తులు ప్రకటించకపోతే జీతాలు స్టాప్...!

అవును.... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని గవర్నమెంట్ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది.

Update: 2024-08-23 16:30 GMT

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ స్థిరాస్తులు, చరస్థులను ప్రకటించాలని.. అలాకానిపక్షంలో జీతాలు నిలిపివేయబడతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం.. గవర్నమెంట్ ఉద్యోగులకు ఈ మేరకు అల్టి మేటం జారీ చేసింది. ఈ ఆదేశాలు పాటించకపోతే 13 లక్షల మందికి పైగా ఉద్యోగుల జీతాలు ఫ్రీజ్ చేస్తామని తేల్చి చెప్పింది!

అవును.... ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని గవర్నమెంట్ ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆగస్టు 31లోగా తమ చరాస్తులు, స్థిరాస్తులను ప్రకటించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాకానిపక్షంలో... జీతాలు నిలిపేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో... ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్స్ పోర్టల్ లో సమర్పించాలని గత ఏడాది ఆగస్టులోనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే సమయంలో... ఈ ఆదేశాలు అన్ని కేటగిరీ ఉద్యోగులకూ వర్తిస్తామని.. ఉద్యోగులంతా వాటిని పాటించాలని తెలిపారు అయితే ఈ ఆదేశాలను పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లైట్ తీసుకున్నట్లున్నారు.

ఈ తరహా ఆదేశాలు తొలుత గడువు డిసెంబర్ 31 నుంచి జూన్ 30 వరకూ పెట్టారు. అనంతరం దీన్ని జూలై 31 వరకూ అనేకసార్లు పొడిగించినప్పటికీ రాష్ట్రంలోని సుమారు 1.78 మిలియన్ల ఉద్యోగుల్లో 26% మంది మాత్రమే ఆదేశాలను పాటించారు. దీంతో... ఈ విషయంపై సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం ఆగస్టు 31లోగా చెల్లించకపోతే జీతాలు ఫ్రీజ్ చేస్తామని తెలిపింది. ఇదే సమయంలో ప్రమోషన్లకూ అనర్హులవుతారని స్పష్టం చేసింది.

అవినీతిని అరికట్టి పాలనను మరింత మెరుగుపరిచేందుకు ఉద్యోగులంతా తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ సందర్భంగ స్పందించిన యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్... గడువులోగా ఆస్తుల వివరాలు సమర్పించినవారికే జీతాలు అందుతాయని స్పష్టం చేశారు. దీంతో... ఆగస్టు 31 తర్వాత ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News