వినోద్ కాంబ్లీ హెల్త్ అప్ డేట్ వచ్చింది... వీడియో వైరల్!

ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, కనీసం నడవలేని స్థితిలో ఉన్నట్లు ఆ వీడియో ద్వారా విపరీతంగా ప్రచారం జరిగింది

Update: 2024-08-10 19:30 GMT

సచిన్ టెండుల్కర్ స్నేహితుడు, టీంఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబందించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, కనీసం నడవలేని స్థితిలో ఉన్నట్లు ఆ వీడియో ద్వారా విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆయన అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు.

ఈ సమయంలో కాంబ్లీ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రార్ధించారు. ఈ నేపథ్యంలో తాజాగా వినోద్ కాంబ్లీ బాగానే ఉన్నారు.. యాక్టివ్ గానే ఉన్నారు.. సన్నిహితులతో కలిసి థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియో తాజాగా విడుదలైంది. ఇప్పుడు ఈ వీడియో కాంబ్లీ ఫ్యాన్స్ కి బిగ్ రిలీఫ్ గా మారిందని అంటున్నారు.

అవును... వినోద్ కాంబ్లీ నడవలేని స్థితిలో ఉన్నాడంటూ వైరల్ అయిన వీడియో నేపథ్యంలో తాజాగా మరో వీడియో తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆ వీడియోలో థమ్స్ అప్ సింబల్ చూపిస్తూ తాను క్షేమంగా ఉన్నట్లు కాంబ్లీ చెప్పాడు. ఆ దేవుడి దయ వల్ల బాగున్నట్లు తెలిపాడు. మైదానంలోకి వెళ్లి బ్యాటింగ్ చేసేటంత ఫిట్ నెస్ తో ఉన్నట్లు ఆ వీడియోలో వెళ్లడించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సుమారు 10వేలకు పైగా పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ అంతర్జాతీయ క్రికెట్ లోనూ ఓ వెలుగు వెలిగాడు. ఇందులో భాగంగా టీమిండియా తరుపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. ఇలా మొత్తం 121 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన కాంబ్లీ 3,561 పరుగులు చేశాడు.

Tags:    

Similar News