బ్యాట్ తో బంతిని కొట్టమంటే.. బాక్స్ ని కొడుతున్న కోహ్లీ వీడియో వైరల్!

పూణెలో జరిగిన రెండో టెస్టులో భారత్ పై 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-27 04:29 GMT

పూణెలో జరిగిన రెండో టెస్టులో భారత్ పై 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా.. మూడు టెస్టుల సిరీస్ ని 2-0 తో కైవసం చేసుకుంది. దీంతో... సుమారు ఆరు దశాబ్ధాల చరిత్రలో భారత గడ్డపై కివీస్ తొలిసారి టెస్ట్ సిరీస్ ని గెలిచింది.

359 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 245 పరుగులకే కుప్పకూలిపోగా.. విరాట్ కొహ్లీ 40 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇలా ఔటైన అనంతరం పెవిలియన్ కి వెళ్తూ అక్కడ విరాట్ చేసిన పనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. తొలి ఇన్నింగ్స్ లోనూ విరాట్.. శాంట్నర్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు.

అవును... మిచెల్ శాంట్నర్ వేసిన లెంగ్త్ బాల్ ని బ్యాక్ ఫుట్ వేసి ఆడేందుకు విరాట్ కొహ్లీ ప్రయత్నించాడు. అయితే అది బ్యాట్ కి దొరకకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్ ని తాకింది. దీంతో.. సహజంగానే కివీస్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది.. అంపైర్ వే లు పైకెత్తేశారు! దీంతో.. విరాట్ కొహ్లీ డీఆరెస్స్ కోరాడు.

ఈ డీఆరెస్స్ రీప్లే లో బంతి లెగ్ స్టంప్ ను తాకీతాకనట్లు వెళ్తూ కనిపించింది! ఫలితంగా.. అంపైర్స్ కాల్ పడింది. దీంతో... విరాట్ కొహ్లీ పెవిలియన్ కు వెళ్లక తప్పలేదు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైరే తొలుత నాట్ ఔట్ అని ప్రకటించాలని భావించాడో ఏమో కానీ... ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ పై విరాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు!

అనంతరం బాధాతపతహృదయంతో అన్నట్లుగా మైదానంలోంచి బయలుదేరిన కొహ్లీ.. పెవిలియన్ కు వెళ్తూ అక్కడ ఉన్న వాటర్ బాక్స్ ను గట్టిగా బ్యాట్ తో కొట్టాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసిని ఓ అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా.. కివీస్ తో జరుగుతున్న సిరీస్ లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన భారత్.. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ ను ఆడనుంది. దీంతో... వాంఖడే లో అయినా విరాట్ బ్యాట్ ఎత్తి అభివాదం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అనంతరం.. ఐదు టెస్టుల సిరీస్ కోసం అస్ట్రేలియా పర్యటనకి వెళ్లనుంది.

Tags:    

Similar News