విష్ణుకుమార్ రాజుకి అసెంబ్లీలో వరుసగా రెండు గౌరవాలు!

గత రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పేరు తెగ మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-07-25 10:14 GMT

గత రెండు రోజులుగా ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పేరు తెగ మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో హోంమంత్రి అనిత మాట్లాడుతున్న సమయంలో ఆయన ముఖంలో కనిపించిన ఆవేదనతో పాటు వైసీపీకి ఓటు వేసిన 40% ప్రజానికపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి విష్ణుకుమార్ రాజు పేరు మారుమ్రోగింది!

అవును... ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నియామకాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఆరుగురు ప్యానెల్ స్పీకర్లతో పాటు భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేత, విప్ ల నియామకాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తున్న వేళ.. ఆయనకు సపొర్ట్ గా ఉండేందుకు నలుగురు ప్యానెల్ స్పీకర్లు నియమించుకోవాలని సీఎం చంద్రబాబు ఇటీవల ఆయనకు సూచించారు. దీంతో... నలుగురు కాకుండా ఆరుగురు స్పీకర్లను ఆయన నియమించనున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ, వరదరాజుల రెడ్డి, కోళ్ల లైత కుమారి పేర్లు వినిపిస్తుండగా.. జనసేన నుంచి మండలి బుద్దప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది.

ఇదే సమయంలో... వైసీపీ నుంచి దాసరి సుధ పేరు వినిపిస్తుండగా.. బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పేరు తెరపైకి వచ్చింది. ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత నియామకానికి కూడా స్పీకర్ ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా... ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సూచనల మేరకు.. విష్ణుకుమార్ రాజుని బీజేపీ శాసనసభా పక్ష నేతగా నియమించాలని నిర్ణయించారు. ఆ పార్టీ విప్ గా ఆదినారాయణ రెడ్డిని ఎంపిక చేశారు!

ఈ విధంగా... అటు ప్యానెల్ స్పీకర్ల జాబితాలో చోటు సంపాదించడంతోపాటు, ఇటు బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా ఎంపిక కావడంతో.. ఒకే రోజు విష్ణుకుమార్ రాజుకి రెండు గూరవాలు దక్కాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News