గొంతులు మారుతున్నాయా ?
మొదటి బహిరంగసభలోనే కేసీయార్ మాట్లాడుతు బీఆర్ఎస్ ఓడిపోతే పోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటామన్నారు.
ఎన్నికల తేది దగ్గరపడుతున్నకొద్దీ బీఆర్ఎస్ గొంతు మారుతోంది. ఎన్నికల ప్రచారంలో బహిరంగసభలతో కేసీయార్ చాలా బిజీగా ఉంటున్నారు. ఇదే సమయంలో మంత్రులు కేటీయార్, హరీష్ రావు రోడ్డుషోలు, ర్యాలీలు, సభలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేయటం, ఆరోపణలు,విమర్శలతో విరుచుకుపడటం రెగ్యులర్ గా జరిగేదే. అయితే ఎన్నికల షెడ్యూల్ కు ముందు కేసీయార్, కేటీయార్, హరీష్ మాట్లాడినట్లుగా ఇపుడు మాట్లాడటంలేదు. ముఖ్యంగా కేసీయార్ మాటల్లో చాలా తేడా కనబడుతోంది.
మొదటి బహిరంగసభలోనే కేసీయార్ మాట్లాడుతు బీఆర్ఎస్ ఓడిపోతే పోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ ఓడిపోతే తనకు వ్యక్తిగతంగా వచ్చే నష్టమేమీలేదని చెప్పారు. ఇందులో రెండు రకాలు కోణాలున్నాయి. మొదటదేమో జనాలను భయపెట్టడం. రెండో కోణం ఏమో ఓటమి భయం మొదలవ్వటం. ఓటమి భయం మొదలైంది కాబట్టే ఓడిపోతే హ్యాపీగా రెస్టు తీసుకుంటామని కేసీయార్ చెప్పింది. లేకపోతే ఇలాగ చెప్పాల్సిన అవసరమే లేదు.
ఇక తాజాగా హరీష్ రావు మాట్లాడుతు తప్పులుంటే సరిచేసుకుంటామన్నారు. ఎలుకలున్నాయని ఇంటిని తగలబెట్టుకుంటామా అనే ఉపమానాన్ని కూడా వాడారు. తప్పులుంటే సరిచేసుకుంటామని అంటే అర్ధం ఏమిటి ? తమ పరిపాలనలో తప్పులు జరిగాయని అంగీకరించటమే కదా. 2018 ఎన్నికల్లో కేసీయార్ ఇచ్చిన హామీలే సంపూర్ణంగా అమలు కాకపోవటం తప్పే కదా. దళితబంధు, బీసీ బంధు లాంటి పథకాలు కూడా అమలుకావటటంలేదు. రైతు రుణమాఫీ కూడా పూర్తిగా అమలు కాలేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ పిల్లర్, బ్యారెజీ కుంగిపోయిన విషయం తెలిసిందే.
ప్రాజెక్టుల్లో, సంక్షేమపథకాల అమలులో ఇలాంటి అవినీతి ఇంకెంత జరిగిందో ఎవరికీ తెలీదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ ఇలాంటివి బయటటపడుతున్నాయి. అందుకనే కేసీయార్, మంత్రులు ఎవరు కూడా మేడిగడ్డ పిల్లర్లు, బ్యారేజి కుంగుబాటు గురించి ఎక్కడా మాట్లాడటంలేదు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా పొరబాటున కూడా కేసీయార్, మంత్రులు సమాధానం చెప్పటంలేదు. అంటే భారీ ఎత్తున అవినీతి జరిగిందని వీళ్ళు అంగీకరిస్తున్నట్లే. అందుకనే ఓడిపోతే హ్యాపీగా రెస్టు తీసుకుంటామని, తప్పులుంటే సరిచేసుకుంటామని గొంతులు సవరించుకుంటున్నది.