ఆ 13 కార్డులలో ఏదున్నా సరే !
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రేపే పోలింగ్. ఏపీలో శాసనసభ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రేపే పోలింగ్. ఏపీలో శాసనసభ, లోక్ సభ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరులుగా మన హక్కు. అయితే ఓటు వేయాలంటే ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్ ఉండాలి. ఇప్పటికే ఓటర్లకు ఈ ఓటర్ స్లిప్స్ అంది ఉంటాయి. ఒక వేళ ఇవి లేకపోతే ఏం చేయాలి ? ఓటు వేయవచ్చా? లేదా ?
ఓటర్ ఐడీ లేకపోతే ఏం చేయాలి ? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఈ ఐడెంటిటీ డాక్యుమెంట్ కార్డ్‌ను పోలింగ్ కేంద్రానికి తీసుకురాలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఓటర్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది. ఓటర్ ఐడీ కార్డ్ లేకపోతే, దానికి బదులుగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి కొన్ని గుర్తింపు కార్డులలో దేనినైనా ఉపయోగించి ఓటు వేయవచ్చు. పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటపుడు ఎపిక్ కార్డు లేని వారు 13 రకాల కార్డులలో ఏదైనా ఒక దానిని ఉపయోగించేకోవచ్చు. కింద ఉన్న 13 కార్డులలో ఏదైనా ఒకటి చూపి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
1) ఓటర్ గుర్తింపు కార్డు 2) ఆధార్ కార్డు 3) ఉపాధిహామీ జాబ్ కార్డు 4) ఫోటోతో ఉన్న బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్ 5) కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు 6) డ్రైవింగ్ లైసెన్స్ 7) పాన్ కార్డ్ 8) కార్మిక మంత్రిత్వ శాఖ పథకం ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు 9) పాస్‌పోర్ట్ 10) ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ 11) కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డు 12) ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు 13) యూనిక్ డిసేబిలిటీ గుర్తింపు కార్డు