'పెద్ద మీడియా' మైనస్.. 'వెబ్‌సైట్ల'దే రాజ్యం.. రీజనేంటి?
ఇప్పుడు వెబ్ సైట్లపైనే ఎక్కు వగా ఆధారపడుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఒకటి వెల్లడించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. ప్రధాన మీడియాగా ఉన్న చానెళ్లు, పత్రికలకు 'విశ్వసనీయత' పెను ప్రమా దంగా మారింది. తెలంగాణలో అయినా.. ఏపీలో అయినా.. ఒకటి రెండు రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉంది. దీంతో ఆయా చానెళ్లు.. పత్రికలు అనుకూల కథనాలనే ప్రచారం చేస్తున్నాయి. సో.. వీటిని పక్కన పెడితే.. నిష్పక్షపాతంగా ఉంటామని చెప్పుకొనే పత్రికలు, ఛానెళ్లు కూడా.. ఇప్పుడు 'నిజాలను' వెల్లడించడంలో వెనుకబడిపోయాయి.
తమకు అనుకూల ప్రభుత్వం ఉంటే ఒక విధంగా.. అననుకూల ప్రభుత్వం ఉంటే మరో విధంగా వ్యవహ రిస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణను తీసుకుంటే.. రైతు రుణమాఫీ విషయంపై వచ్చిన వార్తల్లో ఏది నిజం అని తెలుసుకునే పరిస్థితి ప్రధాన వార్తా పత్రికలను చదివితే అర్థమయ్యే పరిస్థితి లేదు. కొన్ని వ్యతిరేకంగా.. మరికొన్ని ఏకపక్షంగా ఈ వార్తలను ప్రజెంట్ చేశాయి. ఇక, ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని.. యథాతథంగా ప్రచురించడంలో ప్రధాన మీడియా విఫలమైపోయింది.
ఇది ఆయా పత్రికలు, మీడియా ఛానెళ్ల విశ్వసనీయతపై పెను ప్రభావం పడింది. దీంతో సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా.. అక్షర జ్ఞానం ఉండి.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారు.. ఇప్పుడు వెబ్ సైట్లపైనే ఎక్కు వగా ఆధారపడుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ సర్వే సంస్థ ఒకటి వెల్లడించింది. దీనిని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రధాన మీడియా ప్లేస్‌ను రానున్న నాలుగైదేళ్లలోనే వెబ్‌సైట్లు ఆక్రమించినా.. ఆశ్చర్యం లేదని అంటున్నారు.
తెలుగులోను, ఇంగ్లీష్ లోనూ.. ప్రధాన మీడియాకు ఆవల కొన్ని చిన్నపాటి సైట్లు నడుస్తున్నాయి. రాజకీ య, సినిమా సహా ఇతర అంశాలతో వార్తలను ఇస్తున్నాయి. ఎక్కడ ఏది జరిగినా.. క్షణాల్లో అందిస్తున్న బుల్లి వార్తా మాధ్యమాలు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కడా ఇంటర్ ప్రెటేషన్ లేకపోవడం.. జరిగింది.. జరిగినట్టు ఇవ్వడం.. పక్షపాతం లేకుండా.. రాజకీయాలకు అంటగట్టకుండా.. వార్తలను చిన్నవైనా.. పెద్దవైనా అందిస్తుండడంతో ఉద్యోగుల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు.. ప్రబుత్వాల అధికారుల దాకా.. వెబ్ సైట్లను నమ్ముతున్నారన్నది ప్రస్తుత కథనం సారాంశం. సో.. ఈ విశ్వసనీయతను ఏమేరకు వెబ్ సైట్లు కాపాడుకుంటాయో చూడాలి.