నాడు రూ.18 కోట్లు.. నేడు రు.11 కోట్లు.. ఏమిటీ చేప గొప్పతనం?
అయితే వాటి ధర వేళల్లో ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో భారీ చేపల ధర లక్షలు కూడా పలుకుతుందని అంటారు.
అప్పుడప్పుడూ సముద్రంలో భారీ చేపలు పట్టుబడ్డాయని.. గోదావరి జిల్లాలో పులస సమయంలో కూడా ఇలాంటి వార్తలు కనిపిస్తుంటాయి. అయితే వాటి ధర వేళల్లో ఉంటుంది.. కొన్ని సందర్భాల్లో భారీ చేపల ధర లక్షలు కూడా పలుకుతుందని అంటారు. అయితే.. తాజాగా ఓ చేప రూ.11 కోట్లు పలకడం హాట్ టాపిక్ గా మారింది.
అవును... జపాన్ రాజధాని టోక్యోలోని ప్రముఖ ఫిష్ మార్కెట్ లో ఓ అరుదైన చేప సంచలనంగా మారింది. బ్లూఫిన్ ట్యూనా అని పిలవబడే ఈ చేప బరువు సుమారు 276 కిలోలు కాగా... మార్కెట్ లో వేలానికి వెళ్లగా.. భారీ ధరకు అమ్ముడైంది. ఇప్పుడు ఈ విషయం జపాన్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది.
ఈ మేరకు ఒండెరా సంస్థకు చెందిన సుషీ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ చేప కోసం అక్షరలా 1.3 మిలియన్ డాలర్లు (సుమారు 11 కోట్ల రూపాయలు) చెల్లించి సొంతం చేసుకున్నారు. దీంతో... ఈ చేపకు ఇంత ధర ఎందుకు పెట్టారు అనేది చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి కొత్త సంవత్సరం ప్రారంభంలో ట్యూనా చేపను పొందడాన్ని జపనీయ్లు అదృష్ట సుచికగా భావిస్తారంట. ఈ చేప దక్కితే ఈ ఏడాది మొత్తం సిరిసంపదలు కలుగుతాయని నమ్ముతారంట. దీంతో.. ఈ చేపను దక్కించుకునేందుకు ప్రముఖ రెస్టారెంట్లు అన్నీ పోటీ పడగా.. చివరికి సుసీ రెస్టారెంట్ ఈ భారీ ధర చెల్లించి ఈ చేపను దక్కించుకుంది.
ఈ సందర్భంగా స్పందించిన ఒండెరా సంస్థ నిర్వాహకులు... తమ వినియోగదారులకు అత్యుత్తమమైన సుషీ అనుభవం అందించడమే కాకుండా.. అదృష్టాన్ని కూడా పంచాలని ఈ ప్రయత్నం అని ప్రకటించింది. ఇదే సమయంలో... 2025ను తమ కస్టమర్లకు శుభ సంవత్సరంగా మార్చడంలో భాగస్వామ్యం అయినందుకు గర్విస్తున్నట్లు వెల్లడించింది.
కాగా... ఈ స్థాయిలో ట్యూనా చేపలకు జపాన్ లో భారీ ధరలు పలకడం ఇదే తొలిసారి కాదు. 2019లో కూడా సుమారు 278 కిలోల బరువున్న ట్యూనా చేప రూ.18 కోట్లు పలికింది. ఆ రికార్డ్ ఇప్పటికీ అలానే ఉండగా.. ఆ తర్వాత స్థానంలో తాజాగా రూ.11 కోట్ల చేప నిలిచింది.