గామి సినిమా స్టోరీలా ఉంది.. ఈమె పరిస్థితి
ఈ ఘటన చైనాలో కనిపించడంతో వైరల్ గా మారింది.
వైద్యశాస్త్రంలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మనకు తెలియకుండానే శరీరంలో కొన్ని అవయవాలు పుట్టుకొచ్చి మనకు లేనిపోని తంటాలు రావడానికి కారణమవుతాయి. చైనాలో ఓ గమ్మత్తైన విషయం చోటుచేసుకుంది. యువతిలో వ్రషణాలు కనిపించడం అరుదైన విషయం. ఈ ఘటన చైనాలో కనిపించడంతో వైరల్ గా మారింది.
చైనాలోని 27 ఏళ్ల లీ యువాన్ కు కొద్ది రోజుల క్రితం వివాహం కుదిరింది. పెద్దలు వరుడిని ఎంపిక చేసి పెళ్లి చేసేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే షాకింగ్ న్యూస్. లీకి రుతుక్రమం ఆగిపోయింది. దీంతో ఆందోళన చెంది ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అసాధారణ స్థాయిలో హార్మోన్లు, అండాశయ వైఫల్యం ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు ఇంకా కొన్ని టెస్టులు చేశారు.
ఆ పరీక్షల్లో మరో విషయం బయటపడింది. ఆమె పొత్తి కడుపులో వ్రషణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైర్ ప్లాసియా అనే అరుదైన రుగ్మత ఉన్నట్లు బయటపడింది. ఇది సుమారు 50 వేల మంది నవజాత శిశువుల్లో ఒకరికి ఉండేదిగా తేలింది. ఇన్నాళ్లు ఆడదిగా కనిపించిన లీ మగాడుగా తేలింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
లీకి తన జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లు కనిపించింది. ఆమె తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. తమ కూతురుకు ఇలా జరగడాన్ని తట్టుకోలేకపోతున్నారు. లీకి బోలు ఎముకల వ్యాధితో విటమిన్ డి లోపం ఉన్నట్లు గుర్తించారు. ఆమె కడుపులో ఉన్న వ్రషణాలు తొలగించకపోతే ఆమెకు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు.
పుట్టుకతో వచ్చే డ్రినల్ హైపర్ ప్లాసియా అనేది మనిషి అడ్రినల్ గ్రంథులను ప్రభావితం చేసి జన్యుపరమైన రుగ్మత. శరీరానికి అవసరమయ్యే హార్మోన్లను ఉత్పత్తి చేసే విధానంలో అసమతుల్యత కారణంగా లైంగికతపై ప్రభావం చూపుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. లీ జీవితం ఇప్పుడు ఎటు కాకుండా అయింది. ఆమె ఆడది కాదని తేలడంతో ఎటు తేల్చుకోలేకపోతోంది. ఇన్నాళ్లు ఆడదానిగా చెలామణి అయి ఇప్పుడు మగాడిలా ఉండాలంటే కష్టమే.