రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రమాణం చేస్తారంటే...!

అంతే కాదు కాంగ్రెస్ తన దశ దిశను మార్చుకునే విధంగా సంచలన నిర్ణయాలను తీసుకుంది అని కూడా అంటున్నారు.

Update: 2023-12-05 15:58 GMT

తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేర్జుని అధినాయకత్వం ఖరారు చేసింది. తెలంగాణా రాజకీయాల మీద పూర్తి అవగాహనతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంగా అంతా చూస్తున్నారు. అంతే కాదు కాంగ్రెస్ తన దశ దిశను మార్చుకునే విధంగా సంచలన నిర్ణయాలను తీసుకుంది అని కూడా అంటున్నారు.

ఈ రోజున చూస్తే తెలంగాణా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి రూపంలో మంచి నాయకత్వం లభించింది అని అంటున్నారు ఇక సీఎం అభ్యర్ధి ఎంపిక అయితే జరిగింది. రేవంత్ రెడ్డి ప్రమాణం ఎపుడు చేస్తారు ఏమిటి అన్నది ఇపుడు మ్యాటర్ గా ఉంది. రేవంత్ రెడ్డి ఈ నెల 7న ఉదయం పది గంటల 28 నిముషాలకు మంచి ముహూర్తం చూసుకుని సీఎం గా ప్రమాణం చేస్తారు.

ఎల్బీ స్టేడియంలో జరిగే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఘనంగా సాగబోతోంది. ఇక రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి అపుడే సీఎం హోదాలో అధికార మర్యాదలు ప్రోటోకాల్ త్రీసుకుంటున్నారు. ఆయన ఢిల్లీకి చేరుకోగానే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ప్రభుత్వ వాహనాలతో కాన్వాయ్ ఏర్పాటు చేశారు. ఇంకో వైపు తెలంగాణా భవన్ అధికారులు కూడా రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకనున్నారు. మొత్తానికి రేవంత్ ఈసారి ఢిల్లీ టూర్ సీఎం లెవెల్ లోనే సాగబోతోంది.

దాని కంటే ముందు రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. తుపాను నేపధ్యంలో అధికారులు అప్రమత్తం కావాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. కాబోయే సీఎం గా రేవంత్ రెడ్డి ఇచ్చిన మోదటి ఆదేశంగా అంతా చూస్తున్నారు.

Tags:    

Similar News