భార్యపై 72 మందితో అత్యాచారం... నిందితుడి వాంగ్మూలంలో సంచలన విషయాలు!

ఇందులో భాగంగా... ఆమెకు అలా జరిగి ఉండాల్సింది కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

Update: 2024-09-18 00:30 GMT

తాను రేపిస్ట్ నే.. తన భార్యను చాలా ప్రేమించాను.. అని చెబుతూనే ఆమెకు మత్తుమందు ఇచ్చి 72 మందితో 92 సార్లు అత్యాచారం చేయించి.. వాటిని వీడియోలు తీసిన ఓ వ్యక్తి.. తాజాగా కోర్టులో నిజం ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా... ఆమెకు అలా జరిగి ఉండాల్సింది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఆమె కోర్టు హాలులోనే ఉంది!

అవును... ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి, పలువురితో పలుమార్లు అత్యాచారం చేయించిన ఘటన ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ దేశంలో జరిగిన ఈ వ్యవహారం సుమారు పదేళ్లపాటు కొనసాగింది. ఈ సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన పెలికాట్ (71) ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా నేరాన్ని అంగీకరిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాన్స్ లోని ఓ ప్రభుత్వరంగ సంస్థలో పెలికాట్ ఉద్యోగం చేసేవాడు. అయితే ఇటీవల వేరే కేసులో అతడి ఫోన్, కంప్యూటర్ ను పోలీసులు తనిఖీ చేయగా.. దారుణమైన విషయాలు బయటపడ్డాయి. ఇందులో భాగంగా... తన భార్యపై ఇతర వ్యక్తులతో అతడు సాగించిన అకృత్యాలు వెలుగు చూశాయి.

అతడి ఫోన్, కంప్యూటర్ లలో వందల కొద్దీ ఫోటోలు, వీడియోలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతడు రాత్రి పూట తన భార్య తినే ఆహారంలో మత్తుమందు కలిపేవాడు. తర్వాత ఆమె మత్తులోకి జారుకోగానే కొంతమంది వ్యక్తుల్ని ఇంటికి రప్పించేవాడు. వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే.. రహస్య కెమెరాలతో రికార్డ్ చేసేవాడు.

ఈ విధంగా అతడు సాగించిన వికృతచేష్టలకు సంబంధించిన వీడియోలను తన ఫోన్, కంప్యూటర్ లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. 2011 నుంచి 2022 మధ్యకాలంలో సుమారు 72 మందితో 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. అయితే.. తాజాగా వీరిలో సుమారు 50 మందిని గుర్తించగా.. మిగిలినవారి ఆచూకీ దొరకలేదని అంటున్నారు!

తాజాగా ఈ వ్యవహారంపై కోర్టుకు హాజరైన పెలికాట్... ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన 50 మంది గురించీ ప్రస్థావిస్తూ... వారిలాగే తాను రేపిస్టునే అంటూ తెలిపాడు. పైగా... తాను తన భార్యను చాలా ప్రేమించానని.. తనతో ఎంతో సంతోషంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఆమెకు అలా జరిగి ఉండాల్సింది కాదంటూ కోర్టులో వాంగ్మూలం ఇచ్చాడు.

ఇక ఇతరులను రప్పించి, వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నప్పుడు రహస్య కెమెరాల్లో ఆ వ్యవహారాన్ని రికార్డ్ చేయడంపైనా పెలికాట్ స్పందించాడు. ఆనందం కోసమే ఇదంతా చేసినట్లు తెలిపాడు. అనంతరం... తాను చేసిన ఆ పనివల్లే నేడు నిందితులను పట్టుకోవడం సులువైందని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ సమయంలో బాధితురాలు కోర్టులోనే ఉంది. ఈ సందర్భంగా స్పందించిన ఆమె... ఇదంతా వినడం తనకు చాలా కష్టంగా ఉందని.. 50ఏళ్లు అతనితో కలిసి జీవించానని.. అతడిని పూర్తిగా నమ్మానని.. అయితే, అతడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని తెలిపారు. విచారణ నిమిత్తం ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది.

కాగా పెలికాట్ 2020 నుంచి మరో కేసులో రిమాండ్ లో ఉన్నాడు. అతడు మొదట డ్రగ్స్ తాగి ఆపై అతడి భారపై అత్యాచారం చేశాడనే అనుమానంతో అరెస్ట్ చేయబడ్డాడు. అదే సమయంలో అతను ఆన్ లైన్ లో సంప్రదించిన ఇతర పురుషులను అదే పని చేయడానికి ఆహ్వానించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన మనస్తత్వవేత్తలు.. అతనిని "జెకిల్ అండ్ హైడ్" పాత్రగా అభివర్ణించారు.

Tags:    

Similar News