పార్లమెంటుకు పోటీ చేస్తా..: బర్రెలక్క సంచలన నిర్ణయం
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం దక్కించుకు న్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి.. రాజకీ యంగా అలజడి సృష్టించిన నాయకురాలు కర్నే శిరీష. ఉరఫ్ బర్రెలక్క. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై పోరాడేందుకు.. వుద్యోగాలు కల్పించేందుకు.. నేనున్నానంటూ ముందుకు వచ్చిన బర్రెలక్క.. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే.. హోరా హోరీ యుద్ధంలో ఆమె గెలుపు గుర్రం ఎక్కలేదు.
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం దక్కించుకు న్నారు. ఇక, బర్రెలక్కకు సుమారు 5642 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు ప్రజ లకు ఒక్కరూపాయి కూడా పంచలేదు. ఆమెకు మేదావుల నుంచి నిరుద్యోగుల వరకు అందరూ అండగా నిలిచారు. అయినా.. హోరా హోరీ పోరు కావడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. పైగా సమయం కూడా తక్కువగా ఉండడంతో ప్రజల్లోకి పూర్తిగా ఆమె ప్రచారం కూడా వెళ్లలేదు.
అయినా.. కూడా కొన్ని చిన్నాచితకా పార్టీలు.. ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసిన పార్టీల కంటే కూడా మెరుగైన ఓట్లే ఆమెకు వచ్చాయి. ఇదిలావుంటే.. బర్రెలక్క తనకు వచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆదరించి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ స్ఫూర్తిఎక్కడా తగ్గదని.. పార్లమెంటు ఎన్నికల్లోనూ తన పోరు కొనసాగుతుందని వెల్లడించారు.
నిరుద్యోగుల పక్షాన, పేదల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానన్నారు. ఇదిలావుంటే.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆమెకు.. విజిల్ గుర్తు కేటాయించింది.