తెలంగాణా ఎన్నికల ప్రచారంలో పవన్ దిగుతారా...?

ఈ సభలో కూడా తెలంగాణా ఎన్నికల కంటే కూడా ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి పొగడడానికే పవన్ ఎక్కువ సేపు ప్రసంగంలో వినియోగించారు అని కూడా అంతా అన్నారు.

Update: 2023-11-13 12:44 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే తెలంగాణాలో జరిగిన ఒక సభలో పాల్గొన్నారు. అది కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరైన బీసీల ఆత్మ గౌరవ సభ. ఇది తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో నిర్వహించిన సభ. ఈ సభలో కూడా తెలంగాణా ఎన్నికల కంటే కూడా ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి పొగడడానికే పవన్ ఎక్కువ సేపు ప్రసంగంలో వినియోగించారు అని కూడా అంతా అన్నారు.

ఇక చూసుకుంటే తెలంగాణా హోరా హోరీగా ఎన్నికల యుద్ధం సాగుతోంది. బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు. బీజేపీ 111 సీట్లకు పోటీ చేస్తే జనసేనకు ఎనిమిది సీట్లను కేటాయించింది. పవన్ తో పొత్తు వెనక బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఆంతా భావించారు.

అది సహజం కూడా పవన్ లాంటి క్రౌడ్ పుల్లర్ తో పొత్తు పెట్టుకునే సభలు జనాలతో కళకళలాడతాయి. అదే విధంగా ఆయన సినీ హీరోగా క్రేజ్ ఉంది. బలమైన సామాజికవర్గం అండ కూడా ఉంటుంది అని బీజేపీ లెక్కలేసుకుని మరీ పొత్తుకు దిగింది.

పొత్తు అంటే జాయింట్ గా ప్రచారం చేయవచ్చు. లేదా పవన్ జనసేనతో పాటు బీజేపీకి కూడా కొన్ని సభలలో విడివిడిగా ప్రచారం చేయవచ్చు. కానీ ఇప్పటిదాకా చూస్తే పవన్ తెలంగాణా ఎన్నికల ప్రచారం షెడ్యూల్ అయితే బయటకు రాలేదు. చూస్తూండగానే పోలింగుకు గడువు దగ్గరపడుతోంది.

మరి పవన్ ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న చర్చ మాత్రం నడుస్తోంది. కనీసం జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ఎనిమిది సీట్లలో అయినా ప్రచారం చేస్తారా అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. పవన్ ఎన్నికల ప్రచారం చేయాలంటే కచ్చితంగా కాంగ్రెస్ బీయారెస్ పార్టీలను టార్గెట్ చేయాలి.

బీజేపీ గురించి జనసేన గురించి ఒక వైపు చెబుతూనే ప్రత్యర్ధి పార్టీలను గట్టిగా చీల్చిచెండాడాలి. అది కూడా పవన్ ఏపీలో వైసీపీని ఎలా గట్టిగా టార్గెట్ చేస్తారో ఆ రేంజిలో చేస్తేనే తప్ప జనాలు అట్రాక్ట్ కారు. ప్రధానితో పాల్గొన్న సభలో అయితే పవన్ తెలంగాణాలో ఏ పార్టీని విమర్శించలేదు.

జనరలైజ్ చేస్తూ కొన్ని తెలంగాణా సమస్యలను ప్రస్తావించారు. కానీ ఎన్నికల ప్రచారంలోకి వెళ్తే అలా ఉండదు, గట్టిగానే మాట్లాడాలి. ఇక పవన్ సినీ హీరోగా సినిమాలు చేస్తున్నారు. బీయారెస్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటారు. అదే విధంగా కాంగ్రెస్ బీయారెస్ లలో ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి.

ఇపుడు ఎన్నికల ప్రచారం పేరుతో ఆ రెండు పార్టీలను టార్గెట్ చేస్తే కనుక తరువాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న ఆలోచనతో ఎవరైనా పవన్ ఎన్నికల ప్రచారం మీద సలహా ఇచ్చారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో చూస్తే ఎన్నికలకు చాలా దూరం ఉన్నా కూడా జాయింట్ యాక్షన్ కమిటీ పేరిట రెండు పార్టీలు కలసి సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

అదే తెలంగాణాలో చూస్తే పొత్తులు కన్ ఫర్మ్ అయి పోటీకి దిగాక కూడా పవన్ ప్రచారాంలోకి ఎపుడు వస్తారు అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఈ నెల 17న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణా వస్తున్నారు. ఆయన ఏకంగా నాలుగు సభలలో పాలుపంచుకుంటారని అంటున్నారు. మరి అమిత్ షా తో కలసి పవన్ ఎన్నికల సభకలు హాజరవుతారా అన్నది కూడా ఇపుడు అందరిలో చర్చగా ఉంది. ఈ నెల 28తో ప్రచారానికి గడువు ముగుస్తోంది. ఇప్పటి నుంచే గట్టిగా ప్రచారం చేస్తేనే ప్రయోజనం అని అన్న వారూ ఉన్నారు చూడాలి మరి పవన్ ఎపుడు రంగలోకి దిగుతారో.

Tags:    

Similar News