175లో 156 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలు!
అవును... ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం... మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 8 లక్షల 7 వేల 256గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో.. తనవల్ల మీ మీ కుటుంబాల్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం చేస్తున్నారు. మరోపక్క "ఏపీ ప్రజల భవిష్యత్తుకు నాది గ్యారెంటీ" అంటూ చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టారు. త్వరలో పవన్ కూడా ఫుల్ టైం ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్లే అత్యంత కీలకగా మారబోతుండటం ఆసక్తిగా మారింది.
అవును... ఇటీవల ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం... మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 8 లక్షల 7 వేల 256గా ఉంది. అయితే... మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సుమారు 156 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ఈ విషయాలను స్పష్టం చేస్తుంది!
వివరాళ్లోకి వెళ్తే... ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక భూమిక పోషించబోతున్నారు. ఓటర్ల సంఖ్యతో పాటు మహిళల పోలింగ్ శాతం బాగా పెరిగితే సుమారు 150 నియోజకవర్గాల్లోని ఎన్నికల ఫలితాలపై వారి ప్రభావం కీలకంగా మారబోతుందని చెబుతున్నారు. తాజా ఘణాంకాల ప్రకారం... 175 నియోజకవర్గాల్లోనూ సుమారు 156 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా.. ఆ లెక్క 5 వేల నుంచి 35 వేల వరకూ ఉండటం గమనార్హం.
వీటి ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలోనూ సుమారు 8 జిల్లాలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 35వేలకు పైగా ఉండగా... నియోజకవర్గాల విషయానికొస్తే... పురుషుల కన్నా 10వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు దాదాపు 20 ఉన్నాయి! ఇదే క్రమంలో... పురుషుల కన్నా 5వేల మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు దాదాపు 50 ఉన్నాయి!
వీటిలో ప్రాంతాల వారీగా చూస్తే....
ఉత్తరాంధ్ర:
ఇచ్ఛాపురం
కురుపాం
పార్వతీపురం
శృంగవరపుకోట
భీమిలి
విశాఖపట్నంలోని అన్ని జోన్లు
పాడేరు
అనకాపల్లి
పాయకారావుపేట
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో..:
తుని
రామచంద్రాపురం
రాజమండ్రి రూరల్
రాజానగరం
భీమవరం
తణుకు
తాడేపల్లిగూడెం
పోలవరం
కృష్ణా-గుంటూరు..:
గన్నవరం
గుడివాడ
పెనమలూరు
విజయవాడలోని మూడు జోన్లు
నందిగామ
జగ్గయ్యపేట
తెనాలి
ప్రత్తిపాడు
చిలకలూరుపేట
గురజాల
ప్రకాశం, నెల్లూరు జిల్లాలు..!:
పర్చూరు
ఒంగోలు
కోవూర్
నెల్లూర్ సిటీ
నెల్లూర్ రూరల్
గూడుర్
సూళ్లూరుపేట
వెంకటగిరి
రాయలసీమ జిల్లాలు...!
రాజంపేట
కడప
పులివెందుల
జమ్మలమడుగు
ప్రొద్దుటూర్
నందికొట్కూర్
కర్నూల్
పాన్యం
నంద్యాల
అనంతపుర్ అర్బన్
మదనపల్లె
చంద్రగిరి
శ్రీకాళహస్తి
నగరి
చిత్తూరు నియోజకవర్గాలున్నాయి.