మోహన్ బాబు ఇంట్లో పని మనిషి చెప్పినవే అసలు కారణాలా..?
మరోపక్క తన బౌన్సర్లను పోలీసులు బెదిరించి పంపించేశారని.. డిపార్ట్ మెంట్ ఎందుకు పక్షపాతంతో వ్యవహరిస్తోందని మనోజ్ ప్రశ్నించారు.
జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద సోమవారం మధాహ్నం నుంచి కాస్త ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని చెబుతుండగా.. మంగళవారం ఉదయం నాటికి అదికాస్తా తీవ్రమైందని అంటున్నారు. మరోపక్క తన బౌన్సర్లను పోలీసులు బెదిరించి పంపించేశారని.. డిపార్ట్ మెంట్ ఎందుకు పక్షపాతంతో వ్యవహరిస్తోందని మనోజ్ ప్రశ్నించారు.
మరోపక్క మోహన్ బాబు ఇంట్లో సన్నిహితుల సమక్షంలో మోహన్ బాబు - మనోజ్ - విష్ణుతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. పెద్ద మనుషుల సమక్షంలో వివిధ అంశాలపై చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు ఇంట్లో పని మనిషి చెప్పిన విషయాలంటూ కథనాలు హల్ చల్ చేస్తున్నాయి.
అవును... జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొందని అంటున్నారు. విష్ణు - మనోజ్ బౌన్సర్ల మద్య ఘర్షణ వాతావరణం నెలకోందని చెబుతున్నారు. ఈ సమయంలో అసలు మోహన్ బాబు ఇంట్లో ఏమి జరిగిందో ఆ ఇంట్లో పనిచేసే మనిషి కీలక విషయాలు బయటపెట్టారంటూ కథనాలు ప్రత్యక్షమయ్యాయి!
ఇందులో భాగంగా... మోహన్ బాబు దగ్గర పనిచేసే ఒక వ్యక్తి వల్ల అసలు గొడవ మొదలైందని.. అతడు చేసిన తప్పు కారణంగా మనోజ్ అతన్ని కొట్టాడని.. ఆ టైమ్ లో కల్పించుకున్న మోహన్ బాబు.. తన స్టాఫ్ ను కొట్టొద్దని.. నేనే వాడిని భయం చెబుతానని.. నువ్వు చెయ్యి వేస్తే ఊరుకోనని మనోజ్ ను నెట్టేశారని ఆమె చెప్పిందని అంటున్నారు.
ఈ సమయంలో ఎవరీకీ పెద్దగా దెబ్బలు తగలలేదని.. అయితే అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్థలున్నాయని.. భూమా మౌనికను పెళ్లి చేసుకోవడం ఎవరికీ ఇష్టం లేదని.. అయితే.. మనోజ్ కు బిడ్డ పుట్టినప్పుడు అంతా వచ్చారని.. తండ్రీ కొడుకుల వివాదాన్ని పరిష్కరించేందుకు మంచు లక్ష్మి సముదాయించే పనిచేశారని ఆమె వెల్లడించిందంటూ సంచలన కథనం ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తోంది.
దీంతో... ఇది ఆస్తి కోసమో, డబ్బు కోసమో చేస్తున్న పోరాటం కాదు.. ఇది తన భార్య, పిల్లల రక్షణకు సంబంధించిన విషయం అని.. తనను అణగదొక్కేందుకు తన బార్యను బెదిరింపులకు గురి చేయడం.. తన పిల్లలు ఇంట్లో ఉండగానే ఇలా ప్రవర్తించడం సరికాదని మంచు మనోజ్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలకు ఈమె చెప్పిన వెర్షన్ సింక్ అవుతుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయని అంటున్నారు.