మస్క్‌ కు షాక్... కార్యాలయంపై ఎక్స్‌ లోగో తొలగింపు!

శాన్‌ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం పై ఎక్స్‌ లోగోను నగర యంత్రాంగం తొలగించింది. స్థానికుల ఫిర్యాదు తోనే ఈపని చేసినట్లు తెలిపింది.

Update: 2023-08-01 09:13 GMT

కొన్ని రోజుల క్రితం ట్విటర్‌ పేరును ఎక్స్‌ గా మార్చారు ఎలాన్‌ మస్క్‌. దీంతో ట్విటర్‌ పిట్ట స్థానం లో X లోగో వచ్చి చేరింది. ఎలాన్ మస్క్ కు ఎక్స్ అనే అక్షరం చాలా ఇష్టమని.. అందుకే ఆయన మొదటి కంపెనీ నుంచీ ఆ అక్షరాన్ని వదలర ని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ట్విట్టర్ ప్లేస్ లో కూడా ఈ అక్షరం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా శాన్‌ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం పై ఎక్స్‌ లోగోను ఏర్పాటు చేశారు. ఆ భారీ భవంతి పై భారీ స్థాయి లో వైట్ కలర్ ఎల్ఈడీ లైట్ వెలుతురులో ఈ లోగో దర్శనమిచ్చేది. అయితే తాజాగా ఆ లోగో ను శాన్‌ ఫ్రాన్సిస్కో నగర యంత్రాంగం తొలగించింది.

అవును... శాన్‌ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం పై ఎక్స్‌ లోగోను నగర యంత్రాంగం తొలగించింది. స్థానికుల ఫిర్యాదు తోనే ఈపని చేసినట్లు తెలిపింది. ఈ లోగో నుంచి వచ్చే కాంతితో రాత్రుల్లు నిద్రపట్టడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శాన్ ఫ్రాన్సిస్కో యంత్రాంగం ట్విట్టర్ కు ఈ విధంగా క్లారిటీ ఇచ్చింది.

ఎక్స్‌ లోగో డిస్‌ ప్లేలో అమర్చిన ప్రకాశవంతమైన లైట్ల కారణంగా.. రాత్రుళ్లు ఆ కాంతి నేరుగా తమ ఇళ్లలోకి పడుతుందని, దానివల్ల నిద్రకు భంగం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో లోగోను తొలగించినట్లు శాన్‌ ఫ్రాన్సిస్కో సిబ్బంది తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 24 మంది ఫిర్యాదు చేసినట్లు అధికారులు ట్విట్టర్ కు తెలిపారు.

ఇలా స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో... "మా బృందం లోగో ఏర్పాటును సమీక్షించి, నిబంధనల కు విరుద్ధంగా ఏర్పాటు చేసినట్లు నిర్ధారించింది. దీంతో దాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం" అని శాన్‌ ఫ్రాన్సిస్కో భవనాల తనిఖీ విభాగం అధికారి పాట్రిక్‌ హన్నన్‌ తెలిపారు.

Tags:    

Similar News