వైసీపీకి షాక్ ఇచ్చే నాలుగవ రాజ్యసభ సభ్యుడు ?

అయితే వైసీపీలో పదవులు లేని వారి బాధ ఒక ఎత్తు. పధవులు అందుకున్న వారి బాధ మరో ఎత్తు అన్నట్లుగా ఉంది.

Update: 2024-10-22 04:30 GMT

వైసీపీకి షాకుల మీద షాకులు భారీ షాకులు అలా తగులుతూనే ఉన్నాయి. వైసీపీ ఎన్నడూ లేనంతగా పీకల్లోతు కష్టాలలో మునిగిపోయింది. మరి ఈ కీలక సమయంలో ఆ పరీక్షా సమయంలో పార్టీలోని నేతలు అంతా ఐక్యంగా ఉండి తమ వంతుగా బాధ్యతలు నెరవేర్చాలి.

అయితే వైసీపీలో పదవులు లేని వారి బాధ ఒక ఎత్తు. పధవులు అందుకున్న వారి బాధ మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు హాయిగా పదవీకాలం ఉండగానే రాజీనామాలు చేస్తున్నారు. వారిని ఎవరూ ఇసుమంత కూడా కదపలేరు.

వారి పదవులకు ఏ విధంగా చూసినా ఢోకా రాదు. కానీ ఎందుకో ఎందరో ఆశలు దండీగా పెట్టుకుంటే వేళ్ళ మీద లెక్కపెట్టగలితే అతి కొద్ది మందికి మాత్రమే దక్కే రాజ్యసభ చాన్స్ అందుకున్న వారే ఆ పదవి వద్దు అంటూ కూటమి వైపుగా పరుగులు తీస్తున్నారు. ఇప్పటికి వైసీపీ నుంచి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరిపోయారు. ఆర్ క్రిష్ణయ్య మాత్రం బీజేపీలో చేరుతారని అంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే మరి కొద్ది రోజులలో రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేస్తుందని అంటున్నారు. ఆలోగానే మరో వైసీపీ ఎంపీ రాజీనామా చేస్తారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ఆ ఎంపీ కచ్చితంగా రాజీనామా చేస్తారు అని కూటమి పెద్దల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది అని అంటున్నారు. మరి అంతలా వారు చెబుతున్నారు అంటే ఏమైనా తెర వెనక డీల్ కుదిరిందా అన్న చర్చ కూడా వస్తోంది. వైసీపీకి 11 మంది మొత్తం రాజ్యసభ ఎంపీలు ఉంటే అందులో ముగ్గురు రాజీనామా చేయగా ప్రస్తుతం ఆ నంబర్ ఎనిమిదికి పడిపోయింది. ఇపుడు మరో ఎంపీ రాజీనామా అంటే ఏడుగుకు వైసీపీ సంఖ్య పడిపోతుంది అని అంటున్నారు.

వైసీపీ రాజ్యసభ మెంబర్స్ లిస్ట్ చూస్తే వైవీ సుబ్బారెడ్డి వి విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబూరావు, పరిమళ నత్వానీ, నిరంజన్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాధరెడ్డి ఉన్నారు. మరి వీరిలో ఎవరు రాజీనామా చేసే ఎంపీ అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

అయితే వీరిలో కొందరు అయితే వైసీపీకి కట్టుబడిపోతారు. వారి నుంచి రాజీనామాలు అసలు ఊహించలేరు. వారు ఎవరో తెలుసు అని అంటున్నారు. అలా కాకుండా ఊగిసలాడుతున్న వారు ఉన్నారని అంటున్నారు. మరి ఆ ఎంపీ ఎవరో తొందరలోనే బయటకు వచ్చి వైసీపీకి బిగ్ షాక్ ఇస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News