ప్రతిపక్షాన్ని తిట్టాలన్నారు.. అందుకే తప్పుకున్నా: వైసీపీ ఎంపీ హాట్ కామెంట్స్!
ఈ నేపథ్యంలో తాజాగా లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పల్నాడులో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలను ఈసారి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధినేత జగన్ కోరారని.. అయితే ఆయన అందుకు నిరాకరించారని పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రతిపక్ష నేతలను తిట్టి తన విధేయతను నిరూపించుకోవాలని వైసీపీ అధిష్టానం కోరిందని హాట్ కామెంట్స్ చేశారు. అలా తిట్టడం తన పద్ధతి కాదని.. అలాంటి రాజకీయాలు తాను చేయబోనని వారికి చెప్పానన్నారు.
పల్నాడు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం గురించి వైసీపీ అధినేత, సీఎం జగన్ ను కలిశారని లావు తెలిపారు. అప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలను తాను తిట్టాలని ఎమ్మెల్యేలతో జగన్ చెప్పించారని లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఇదే విషయాన్ని తనకు చెప్పారని.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలను తిట్టాలని కోరారన్నారు.
ఇలా తిట్టడం తన పద్ధతి కాదని.. తన దారిలోకి రావద్దని ఎమ్మెల్యేలకు తాను చెప్పానని శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. పార్టీలో ఇన్నాళ్లు ఉన్నాక తన విధేయతను నిరూపించుకోవాలని కోరడం తనకు నచ్చలేదని తెలిపారు,
ప్రతిపక్ష నేతలను తిట్టాలని చెప్పడం తనకు నచ్చకపోవడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. తనను గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం కోరిందన్నారు. అక్కడ ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభ సభ్యుడిగా పంపుతామని చెప్పిందన్నారు. నరసరావుపేట సీటు కావాలంటే పార్టీలో తన విధేయత నిరూపించుకోవాలని కోరారన్నారు. ఇందుకు విలేకరుల సమావేశం పెట్టి ప్రతిపక్ష నేతలను తిట్టాలని ఎమ్మెల్యేల చేత చెప్పించారని లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను మళ్లీ పల్నాడు నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. కాగా లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళ్లడం ఖాయమేనని అంటున్నారు. టీడీపీ తరఫున నరసరావుపేట నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తో లావు భేటీ అయ్యారు. అలాగే ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయనను శ్రీకృష్ణదేవరాయలు కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.