వైసీపీ నాలుగవ జాబితా రిలీజ్...!
ఇందులో చూస్తే చిత్తూరు ఎంపీ సీటుకి ఇంచార్జిగా నారాయణస్వామిని ప్రకటించారు.
మొత్తానికి ఊరించి మరీ వైసీపీ నాలుగవ జాబితా బయటకు వచ్చింది. ఈ జాబితాలో చూస్తే ఒక ఎంపీ ఎనిమిది మంది ఎమ్మెల్యేల సీట్లకు ఇంచార్జ్లను వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి విడుదల చేశారు.
ఇందులో చూస్తే చిత్తూరు ఎంపీ సీటుకి ఇంచార్జిగా నారాయణస్వామిని ప్రకటించారు. అలాగే గంగాధర నెల్లూరుకు రెడ్డప్పను ప్రకటించారు. ఇక శింగనమలకు వీరాంజనేయుడు, నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్, తిరువూరుకు నల్లగట్ల స్వామిదాస్, మడకశిరకు ఈర లక్కప్ప, కొవ్వూరుకు తలారి వెంకటరావు, గోపాలపురంకి తానేటి వనిత , కనిగిరికి దద్దాల నారాయణ యాదవ్ లను ప్రకటించారు.
ఇక్కడ చూస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామికి తెచ్చి చిత్తూరు ఎంపీగా చేశారు. అలాగే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రెడ్డప్పని తెచ్చి గంగాధర నెల్లూరుకి మార్చారు. అలాగే హోం మంత్రి తానేటి వనిత సీటు కొవ్వూరుని మార్చి అక్కడ గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావుకు ఇచ్చారు. ఆయన సీటు గోపాలపురం నుంచి వనితను ఇంచార్జిగా నియమించారు.
మొత్తమ్మీద చూస్తే ఎనిమిది అసెంబ్లీ సీట్లలో మార్పులు చేశారు. ఇక చిత్తూరు ఎంపీ క్యాండిడేట్ గా ఉప ముఖ్యమంత్రిని నియమించినట్లుగా ఉంది. ఒక్క జనరల్ సీటుతో పాటు ఏడు ఎస్సీ అసెంబ్లీ సీట్లలో ఈ కీలకమైన మార్పులు జరిగాయి.