వైసీపీ అసలు నెంబర్ ఇది...విపక్షానికి భారీ షాక్...!?

తాము చెప్పిన మేరకు అన్ని పధకాలు అమలు చేసామని అంటున్నారు. దాంతో ప్రజలు కూడా తమకు పూర్తి మద్దతుగా నిలుస్తారు అన్నది వైసీపీ నేతలు చెబుతున్న మరో మాట.

Update: 2024-02-18 16:30 GMT

వైసీపీ వై నాట్ 175 అని అంటోంది. మొత్తానికి మొత్తం ఏపీలో ఉన్న సీట్లు అన్నీ గెలుచుకుంటామని ధీమాగా వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇందులో చంద్రబాబు కుప్పం, నారా లోకేష్ మంగళగిరి, పవన్ కళ్యాణ్ భీమవరం కూడా ఉన్నాయి. అసెంబ్లీ మొత్తం మీద రెండవ పార్టీని రానీయకుండా మేమే ఉంటాం అన్నది వైసీపీ చెప్పే మాట. మాకు ఆ విధంగా జనాదరణ ఏపీలో ఉంది అని కూడా చెబుతున్నారు.

తాము చెప్పిన మేరకు అన్ని పధకాలు అమలు చేసామని అంటున్నారు. దాంతో ప్రజలు కూడా తమకు పూర్తి మద్దతుగా నిలుస్తారు అన్నది వైసీపీ నేతలు చెబుతున్న మరో మాట. తాము ఇచ్చిన హామీలను చూసి 151 సీట్లు కట్టబెట్టారని, తాను అన్ని హామీలను అమలు చేసి చూపాం కాబట్టి ఆ 24 సీట్లు కూడా తెచ్చి వైసీపీ ఖాతాలోనే కలుపుతారు అన్నది బలమైన ఆత్మ విశ్వాసానికి సంకేతం. అయితే ఇది విపక్షాలను వీక్ చేయడానికి వైసీపీ ఆడే మైండ్ గేమ్ అని కూడా అంటున్నారు

ఇదే విషయం మీద ఇటీవల మాజీ మంత్రి పేర్ని నానిని ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఎన్ని సీట్లు మీరు గెలుస్తారు అంటే ఆయన 175 అని చెప్పారు. అలా కాదు కానీ మీకంటూ ఒక నెంబర్ ఉంటుంది కదా ఇంటర్నల్ గా డిస్కషన్ ఉంటుంది కదా అని కూడా అడిగారు. దానికి మేము 175 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నాం, అన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు తప్ప ఎక్కడా ఒక్క సీటు కూడా తగ్గలేదు.

అయితే వైసీపీ బయటకు చెబుతున్న 175 సీట్లు గెలుస్తుందా అంటే ఇంటర్నల్ గా ఒక నెంబర్ అయితే వైసీపీ పెట్టుకుంది అని అంటున్నారు. ఆ నెంబర్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ సీట్లు తగ్గే సమస్య లేదని అంటున్నారు. ఆ నెంబర్ 115. ఈ నెంబర్ కు ఒక సీటు తగ్గదు, ఆ మీదట వైసీపీ వేవ్ సైలెంట్ గా ఉంటే మరిన్ని సీట్లు రావడమే అన్నట్లుగా వైసీపీ హై కమాండ్ భావిస్తోందిట.

దానికి వారి లెక్కలు చాలానే ఉన్నాయని అంటున్నారు. గతసారి ఎన్నికల్లో దాదాపుగా యాభై శాతం ఓటు షేర్ ని సాధించిన వైసీపీ ఈసారి అంతకంటే తగ్గుతుంది అని లెక్క వేసుకుంటోంది అని అంటున్నారు. అది ఎంత తగ్గినా ఎట్టి పరిస్థితుల్లోనూ 46 శాతం కంటే తగ్గదు అని లెక్క ఉందిట. అంతే కాదు వైసీపీకి గత ఎన్నికల్లో కోటీ అరవై లక్షల మంది ఓట్లు వేశారు. ఈసారి అందులో ఒక ముప్పయి లక్షలు తగ్గి కోటీ ముప్పయి లక్షలు వచ్చినా తమకే మెజారిటీ సీట్లు, ప్రభుత్వం కూడా తామే మళ్లీ ఏర్పాటు చేస్తామని కూడా ధీమాగా ఉన్నారట.

మరో వైపు చూస్తే రానున్న ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్న దాని మీద వైసీపీ అన్ని రకాలైన వ్యూహాలతో రెడీ అయింది అని అంటున్నారు. వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అని అంటున్నారు. విపక్షాలు ఎంత చేసినా అరవై సీట్ల లోపే ఉంటాయని పక్కగా వైసీపీ వద్ద లెక్క ఉందిట. దాంతోనే ఎన్నికల్లో టికెట్లు నిరాకరించిన వారికి వైసీపీ హై కమాండ్ అయితే పూర్తి స్థాయిలో నచ్చచెబుతోందిట.

ఈసారి కూడా మళ్లీ మనమే వస్తున్నాం, రెండవసారి అధికారంలోకి వచ్చాక తగిన పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని కూడా చెబుతున్నారుట. మొత్తానికి వైసీపీ వై నాట్ 175 వెనక ఇంత కధ ఉంది అని అంటున్నారు. అరవై సీట్లకు కోత పెట్టినా 115 సీట్ల గెలుపుతో రెండవసారి గెలవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News