వైఎస్సార్ విగ్రహాలు కట్టించిన వారు టీడీపీకి ఓట్లు ఎందుకు వేశారు జగన్ ?

ఏకంగా దశాబ్దన్నర కాలం పాటు వైసీపీ వెంట నడచిన వారు ప్రతీ ఊరిలో ప్రతీ గల్లీలో వైఎస్సార్ విగ్రహాలు కట్టించిన వారు అంతా 2024 ఎన్నికల్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు.వారంతా టీడీపీకే ఓటు వేశారు.

Update: 2024-07-01 14:50 GMT

ఇది చాలా చిన్న ప్రశ్నగా ఉన్నా జవాబు చెప్పడం కష్టం. లోతుకు వెళ్ళి చూస్తే బోలెడంత మ్యాజిక్ ఉంది. అలాగే పొలిటికల్ లాజిక్ కూడా ఉంది. అయితే ఇది వైసీపీ అధినాయకత్వానికి అర్థం కావాలీ అంటే గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ తెలియాలి. తెలిసినా వాటిని డైజెస్ట్ చేసుకునే ధైర్యం ఉండాలి.

అపుడే అవి పూర్తిగా బోధపడతాయి. ఇంతకీ విషయం ఏమిటి అంటే కరడు కట్టిన వైఎస్సార్ అభిమానులు కూడా ఈసారి టీడీపీ కూటమికి జై కొట్టారు అని. ఈ మాట చెప్పడానికి పెద్దగా రాజకీయ విశ్లేషణలు అవసరం లేదు. దాని కంటే ఎక్కువగా పొలిటికల్ పండిట్స్ కానవసరం లేదు.

కూటమిని వచ్చిన భారీ సీట్లు అదిరిపోయే మెజారిటీలు, ఓటు షేర్ సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వైసీపీకి వచ్చిన కేవలం పదకొండు సీట్లు ఇవి చాలు వైసీపీ ఓట్లు కూడా గంపగుత్తగా టీడీపీ కూటమి సైడ్ తీసుకున్నాయని చెప్పడానికి.

ఇదిలా ఉంటే 2009 నుంచి జగన్ వెంట నడచిన బలమైన వర్గాలు ఉన్నాయి. వాటికి మించి వైఎస్సార్ ని గుండెలలో పెట్టుకున్న వీరాభిమానులు ఉన్నారు. వీరే వైసీపీకి అసలైన పెట్టుబడి. మరి వీరి అండతోనే కదా వైసీపీ గడచిన పదిహేనేళ్ళలో ఎంతగానో పొలిటికల్ గా ఎదిగింది అన్నది అసలైన విశ్లేషణ.

Read more!

ఏకంగా దశాబ్దన్నర కాలం పాటు వైసీపీ వెంట నడచిన వారు ప్రతీ ఊరిలో ప్రతీ గల్లీలో వైఎస్సార్ విగ్రహాలు కట్టించిన వారు అంతా 2024 ఎన్నికల్లో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు.వారంతా టీడీపీకే ఓటు వేశారు. అది కసిగా వేశారా లేక వైసీపీ మీద విరక్తితో వేశారా లేక ఒక గుణపాఠం చెప్పాలని వేశారా అన్నది పక్కన పెడితే వారి ఓట్లను మాత్రం వైసీపీ పూర్తి స్థాయిలో పోగొట్టుకుంది.

వైఎస్సార్ అంటే ఇష్టం అంటే ఆటోమేటిక్ గా ఆయన రక్తం అయిన జగన్ అంటే కూడా ఇష్టమే కదా. అదే కదా గత పదిహేనేళ్ళుగా రుజువు అవుతూ వస్తోంది. అలాంటి వారు తండ్రిని ప్రేమించి కొడుకు పట్ల కోపం పెంచుకున్నారా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ పెంచుకుంటే జగన్ మీదనే ఆ కోపం అంతా ఉందా లేదా ఆయనకు కుడి ఎడమలుగా ఉన్న వారి మీద కోపం ఉందా అన్నది కూడా మరో రకమైన చర్చగా ఉంది.

క్యాడర్ కి జగన్ ఏమీ చేయలేదని కోపమా లేక పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారు అని కోపమా సోషల్ మీడియా టీం ని కూడా పట్టించుకోలేదు అని కోపమా అంటే వీటి అన్నింటికీ ఒక్కటే సమాధానం వస్తుంది. అదే అవును అని. ఎందుకంటే ఇవన్నీ కలసే జగన్ మీద పీకల దాకా కోపం పెంచుకునేలా చేశాయని అంటున్నారు.

అంతే కాదు జగన్ వద్దు అన్నంతగా వారు మండిపోయి మరీ రాజకీయంగా బద్ధ శత్రువు అయిన టీడీపీని నెత్తికెక్కించుకున్నారు అంటే అది ఎంత ప్రమాదకరమైన ఆగ్రహం అన్నది జగన్ ఇప్పటికైనా గుర్తెరిగారా అని ప్రశ్నిస్తున్నారు. సొంత డబ్బులు వేసి ప్రతీ ఊరిలో వైఎస్సార్ విగ్రహాలను కట్టించుకున్నారు.

వారే ఆ విగ్రహాలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తమ ఆరాధ్య దైవంగా వైఎస్సార్ ని చూస్తున్నారు. మరి అలాంటి వారికి జగన్ నచ్చలేదు అంటే తేడా ఎక్కడో కొడుతున్నట్లుగానే చూడాలని అంటున్నారు. వైఎస్సార్ వేరు జగన్ వేరు అని తత్వం బోధపడిన మీదటనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు అని కూడా అంటున్నారు. దీంతోనే వారంతా దూరం అయ్యారని వైసీపీని అధికారం మీద నుంచి దూరం చేసారని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను జాగ్రత్తగా ఆలోచించి పరిగణనలోకి తీసుకోకపోతే మాత్రం జగన్ ఇబ్బందుల్లోకి పూర్తిగా పడినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News