తొలి ఓటు ఎప్పటికీ గుర్తుండాలని !

ఓటును వినియోగించుకోవడం పౌరులుగా మన హక్కు. అయితే తొలిసారి జీవితంలో ఓటు వేయడం అంటే యువతలో ఎంతో ఉత్సాహం ఉంటుంది.

Update: 2024-05-14 06:25 GMT

ఓటును వినియోగించుకోవడం పౌరులుగా మన హక్కు. అయితే తొలిసారి జీవితంలో ఓటు వేయడం అంటే యువతలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆ యువత ఓటే ఎవరు విజేత అని నిర్ణయించడంలో కీలకం అవుతుంది. అయితే తొలిసారి ఓటు వేసేందుకు వెళ్తున్న ఓ యువకుడు అది జీవితంలో ఎప్పటికి గుర్తుండాలని భావించి వినూత్న రీతిలో పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాడు. దున్నపోతుపై ఎక్కి పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. బీహార్ రాష్ట్రంలోని ఉజియార్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమస్తిపూర్‌ జిల్లాలోని ఉజియార్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన యువకుడికి ఇటీవలే ఓటు హక్కు వచ్చింది. దాంతో తన తొలి వేటు ఎప్పటికీ గుర్తుండాలని వినూత్నంగా ఆలోచించాడు. నల్ల చొక్కా, గ్రే కలర్‌ ప్యాంట్ ధరించి, తలకు ఆకుపచ్చ తలపాగా చుట్టి దున్నపోతుపై పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశాడు.

దున్నపోతు తలకు కూడా యువకుడు ఆకుపచ్చ తలపాగా చుట్టాడు. దున్పపోతుపై ఓటు వేయడానికి తరలివచ్చిన యువకుడిని ఓటర్లంతా ఉత్సాహంగా వీక్షించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది. దానిపై నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు.


Tags:    

Similar News