ఏపీలో జగన్ ఎన్నికల నినాదం మారుతుందా... !
దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు.. అంటూ.. ఏవేదికెక్కినా సీఎం జగన్ చేస్తున్న ప్రసంగాల విష యం తెలిసిందే
ఏపీలో రాజకీయ పరిణామాలు మారాయా? ఇప్పటి వరకు ఒక విధానంగా జరిగిన రాజకీయాలు.. ఇప్పుడు కొత్తరూపు సంతరించుకున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి ఉన్నా.. వచ్చే 40 నుంచి 50 రోజుల్లో రాజకీయ వాతావరణం పూర్తిగా మారుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రజలకు తప్ప.. అన్నట్టుగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రజల్లోకి బలంగానే వెళ్తున్నాయి.
దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు.. అంటూ.. ఏవేదికెక్కినా సీఎం జగన్ చేస్తున్న ప్రసంగాల విష యం తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నా.. ఈ విషయాన్నే చెబుతూ వచ్చారు. అయితే.. ఇప్పుడు మరింతగా ప్రజలను కార్నర్ చేస్తూ.. ప్రచారానికి రెడీ అవుతున్నా రు. ప్రజల చేత, ప్రజల వలన అన్నట్టుగా వైసీపీ ప్రచారం మొత్తం ప్రజల చుట్టూ తిరగనుంది. అంతేకా దు.. ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను కూడా వివరించనున్నారు.
పథకాలు, సంక్షేమాన్ని ఒకవైపు గృహ సారథులు, వలంటీర్లు ప్రజలకు వివరిస్తున్నారు. ఇది క్షేత్రస్థాయి లో ప్రజలకు బాగా రీచ్ అవుతోంది. అంతేకాదు.. ఇప్పుడు గణాంకాలతో సహా.. మీ కుటుంబానికి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇన్ని వేల రూపాయల మేలు జరిగిందంటూ.. ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. అంతేకాదు.. మీకు ఇళ్లు ఇచ్చారు. మీ బిడ్డలకు సొమ్ములిచ్చారు.. మీ పొలాలకు నిధులు అందించారు. అంటూ.. వాట్సాప్ సహా.. ఇతర మాధ్యమాల్లో ఆయా వివరాలను వెల్లడిస్తున్నారు.
దీంతో క్షేత్రస్థాయిలో డిజిటల్ రూపంలో ప్రచారం కన్నా.. వివరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఎవరూ కాదనలేని.. తోసిపుచ్చలేని అంశంగా మారింది. ఇది వచ్చే ఎన్నికల సమయానికి అందే నిధుల కు, లేదా పథకాలకు అదనంగా మారింది. మరోవైపు.. సీఎం జగన్ కూడా.. ఈ నెల 27 నుంచి నేరుగా ప్రజ ల్లోకి వెళ్తున్నారు. అక్కడ కూడా ఆయన సంక్షేమం, పథకాలను వివరించనున్నారు. మొత్తంగా చూస్తే.. దేవుడి దయ.. మీ అందరి చల్లని దీవెన అనే మాటే నినాదంలో ప్రజలకు వివరించనున్నారు. దీంతో వైసీపీ మేళ్లను కాదనలేని పరిస్థితిని.. తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తుండడం గమనార్హం.