లడ్డూ ఇష్యూ : టీడీపీ ట్రాప్ లో వైసీపీ ?

తిరుమల లడ్డూ విషయంలో గత పదిహేను రోజులుగా టీవీ సీరియల్ మాదిరిగా ఎపిసోడ్ సాగుతోంది.

Update: 2024-09-29 19:23 GMT

తిరుమల లడ్డూ విషయంలో గత పదిహేను రోజులుగా టీవీ సీరియల్ మాదిరిగా ఎపిసోడ్ సాగుతోంది. లడ్డు కలుషితం అయింది అని టీడీపీ కూటమి వాదిస్తోంది. కాదు అంతా బాగుందని విపక్ష వైసీపీ కౌంటర్ చేస్తోంది. అయితే ఇక్కడో రాజకీయ తమాషా ఉంది. దానిని ఎంతమంది గమనించారో కానీ లాజిక్ కి అందుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఆకుకూ పోకకూ పొందకుండా ఈ వ్యవహారం ఉండడమే ఇంట్రెస్టింగ్ అని అంటున్నారు.

లడ్డూలు కలుషితం అయ్యాయి అన్నది ఎపుడు తేలింది అంటే అధికార టీడీపీ అధికారం చేపట్టాక. అంటే జూలై 6, 12 తేదీలలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో ఈ కల్తీ జరిగింది అన్నది కూటమి ఆరోపణ. అయితే అసలు కల్తీ జరగలేదు అని విపక్షం వాదిస్తోంది. నిజానికి విపక్షానికి దీనికి ఎందుకు సంబంధం అన్న ప్రశ్న సహజంగా వస్తుంది.

కల్తీ నెయ్యి విషయంలో టీడీపీ అతి ఉత్సాహానికి తగిన ప్రోత్సాహం అందిస్తూ ఆ పార్టీ ట్రాప్ లోకి వైసీపీ చాలా ఈజీగా వెళ్ళిందని అంటున్నారు. నిజానికి ఇది టీటీడీ అన్న ఒక స్వంత్రంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ లో జరిగింది. తప్పు జరిగితే ఆ సంస్థ చూసుకుంటుంది. ఒకవేళ చెబితే ప్రభుత్వానికి చెబుతుంది.

ప్రభుత్వం రియాక్ట్ అయితే దానికి ప్రతిగా రియాక్ట్ కావాల్సింది గతంలో టీటీడీ చైర్మన్లుగా ఈవోలుగా పనిచేసిన వారు అయి ఉండాలి. అలా వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇక గత ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియదు.

ఈ నేపథ్యంలో సత్య ప్రమాణం చేసినా సవాల్ చేసినా కూడా వారి నుంచే జరిగితే బాగుండేది. కానీ వైసీపీ అధినాయకత్వం సీన్ లోకి వచ్చింది. సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకుంది. జగన్ మీద నేరుగా టీడీపీ కూటమి తరఫున చంద్రబాబు విమర్శలు చేస్తే దానికి జగన్ రియాక్ట్ అయ్యారు. తప్పు జరిగింది టీటీడీ వ్యవస్థలో అయితే మీరు ఎందుకు వస్తున్నారు అని పవన్ కళ్యాణ్ జగన్ ని ప్రశ్నించారు కూడా.

అయినా వైసీపీ ఈ ఇష్యూని రైజ్ చేస్తూనే ఉంది. అలా టీడీపీ కూటమి ట్రాప్ లో కంప్లీట్ గా పడిపోయింది అని అంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటి అంటే జూలై నెలలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు కల్తీవో కావో ఆ ప్రభుత్వం చూసుకుంటుంది. దానికి వైసీపీ సర్టిఫికేట్లు ఇవ్వడం ఏమిటి ఎందుకు అన్న చర్చ కూడా వస్తోంది.

వాస్తవంగా జూలైలో వచ్చిన నెయ్యి ట్యాంకర్లలో కల్తీ జరిగితే దానిని చక్కదిద్దడం సరిచేయడం అన్నది టీడీపీ కూటమి బాధ్యత. అయితే కూటమి ఇక్కడ జరిగింది కాబట్టి గతంలో జరిగి ఉండవచ్చు అని అంచనాకు వచ్చి వాదిస్తోంది. అలా అంచనాకు రావడం తప్ప ఆధారాలు అయితే లేవు. మరి గతంలో జరగలేదు అని చెప్పుకోవడం దాకా వాదించి అక్కడితో వైసీపీ ఆగితే బాగుండేది.

కానీ టీడీపీ కూటమి హయాంలో కల్తీ జరిగిందా లేదా అన్నది సంబంధం లేకపోయినా ఎందుకు వకాల్తా పుచ్చుకుంటున్నారు అన్నదే చర్చ వస్తోంది. ఈ నెయ్యి ట్యాంకర్లను చూపించి గతంలో జరిగింది అని టీడీపీ ఎంత చెప్పినా ఆధారాలు అయితే ఈ రోజుకి లేవు. ఒక వేళ వాగ్మూలం లాంటివి ఉంటే సిట్ దర్యాప్తులో అవి బయటకు వస్తే అపుడు వైసీపీ సీరియస్ గా స్పందించినా బాగుండేది అని అంటున్నారు.

అందుకే అలా వైసీపీ టీడీపీ ట్రాప్ లో చిక్కుకుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ వ్యవహారం హాట్ హాట్ గా సాగుతూండగా జగన్ తిరుమల దర్శనం చేసుకోవడానికి వెళ్తాను అని చెప్పడం ద్వారా కొత్త రచ్చకు ఆస్కారం ఇచ్చారు అని అంటున్నారు. దాంతో ఆయన అన్య మతస్థుడని ముద్ర వేయడానికి ఎవరికీ చాన్స్ లేకుండా ఆయనే వేసుకున్నారని అంటున్నారు. ఇది సెల్ఫ్ గోల్ అని అంటున్నారు. ఇక టీడీపీ ఏమి ఆశించిందో అదే జరిగే విధంగా వైసీపీ అందిస్తున్న ఈ తరహా రాజకీయం మూలంగానే ప్రతిపక్ష పార్టీ పూర్తిగా కార్నర్ అవుతోంది అని అంటున్నారు.

వైసీపీ ఈ వ్యవహారంలో ఏమి నిజాలు తేలాలని అనుకుంటుందో అయితే క్లారిటీ లేదు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ జరగలేదు అని చెబితే ఆ క్రెడిట్ ఆ ప్రభుత్వానికే వస్తుంది. గతంలో జరిగింది అన్న దాని మీద అనుమానాలు ఎటూ కూటమి పెద్దలు కలిగించారు. మరి దాని మీద ఏ రకమైన విచారణ జరిగి నిజాలు బయటకు రావాల్సి ఉంది అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా వైసీపీ లడ్డూ విషయంలో పూర్తిగా టీడీపీ ట్రాప్ లో చిక్కుకుంది అనే అంటున్నారు.

Tags:    

Similar News