నెల్లూరు విషయంలో వైసీపీ డేరింగ్ డెసిషన్....!

వైసీపీలో టికెట్లు అభ్యర్ధుల విషయంలో ఇప్పటిదాకా వినిపిస్తున్నది ఒకటైతే నెల్లూరు విషయంలో మాత్రం జరుగుతున్న ప్రచారం కొంత ఆశ్చర్యంగానే ఉంది.

Update: 2023-07-18 17:22 GMT

వైసీపీలో టికెట్లు అభ్యర్ధుల విషయంలో ఇప్పటిదాకా వినిపిస్తున్నది ఒకటైతే నెల్లూరు విషయంలో మాత్రం జరుగుతున్న ప్రచారం కొంత ఆశ్చర్యంగానే ఉంది. నెల్లూరులో మొత్తం పది సీట్లు ఉంటే అందులో సిట్టింగులకు మరోమారు టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అధినాయకత్వం రెడీ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నారు.

నెల్లూరులో పదికి పది సీట్లు వైసీపీ 2019 ఎన్నికల్లో గెలుచుకుంది. అందులో ముగ్గురు వైసీపీ గీత దాటేసి బయటకు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన ఏడింటిలో ఆరుగురు సిట్టింగులకే టికెట్లు కేటాయించాలని అధినాయకత్వం ఒక డేరింగ్ అండ్ డేషింగ్ డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. అలా చూస్తే నెల్లూరు సిటీ నుంచి మరోమారు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారు, కొవ్వూరు నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సుళ్ళూరుపేట నుంచి కిలివేటి సంజీవయ్య, ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రం రెడ్డి పోటీ చేయబోతున్నారు. అలాగే సర్వేపల్లి నుంచి మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి మళ్లీ పోటీ చేయడం ఖాయం.

ఇక మిగిలిన నాలుగింటిలో గూడూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాదరావుకు టికెట్ దక్కదని అంటున్నారు. అదే విధంగా వైసీపీని వీడిన వారిలో నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఆయన సీటుకు ఇంచార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డిని నియమించారు. ఆయనకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని అంటున్నారు. అదే విధంగా ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇక వెంకటగిరి నుంచి ఇంచార్జిగా ఉనన్ నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి డల్ గా ఉంటున్నట్లుగా నివేదికలు ఉన్నాయట.

దాంతో ఎన్నికల వేళకు గూడూరు, వెంకటగిరిలకు కొత్త అభ్యర్ధులను పార్టీ ప్రకటించనుంది అని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైసీపీకి లక్కీ జిల్లాగా ఉన్న నెల్లూరు నుంచి పది సీట్లలో ఎనిమిదింటిని వైసీపీ ఖరారు చేసేసింది అని అంటున్నారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నుంచి లోక్ సభకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని సెలెక్ట్ చేసి పెట్టారు.

అంగబలం అర్ధబలం పుష్కలంగా ఉన్న ఆయన రానున్న ఆరు నెలలూ నెల్లూరు మీదనే ఫుల్ గా దృష్టి పెట్టి పనిచేస్తారు అని అంటున్నారు. పార్టీ పరంగా కాకుండా తనకు ఉన్న ఇమేజ్ పరంగా కూడా బలమైన నేతగా ఉన్న వేమిరెడ్డి ఆగస్ట్ నుంచి నెల్లూరు మీదనే ఫుల్ ఫోకస్ పెట్టి బరిలోకి దిగుతారు అని తెలుస్తోంది. మొత్తానికి మరోసారి పదికి పది సీట్లు నెల్లూరు నుంచి గెలుచుకోవడానికి వైసీపీ పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News