మహిళలు-మైనారిటీలు-బీసీలు.. తేల్చేసిన వైసీపీ ...!
ప్రస్తుతం రాష్ట్రంలో 4 కోట్ల 2 లక్షల 396 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో రెండు కోట్ల పైచిలుకు బీసీ ఓటర్లు ఉన్నారు
మళ్లీ గెలవాలి.. ఇంకో మాటకొస్తే.. మళ్లీ మళ్లీ గెలవాలి.. ప్రజల మెప్పు పొందాలి.. సుపరిపాలన అందించా లి! ఇది కేవలం నినాదం కాదు.. వైసీపీ అధినాయకత్వంలో నరనరాన జీర్ణించుకున్న కీలక విషయం. అదే.. ఇప్పుడు వైసీపీని నవనవోన్మేషంగా ముందుకు నడిపిస్తోంది. మార్పు దిశగా పార్టీని.. ప్రజల ఆలోచ న దిశగా నాయకులను నడిపిస్తోంది. ఏదో ఉన్నారు కదా.. అని టికెట్లు.. మనోళ్లే కదా.. అని పదవులు పంచేయడం కాకుండా.. ప్రజానాడిని పట్టుకోవడంలో వైసీపీ సంపూర్ణంగా సక్సెస్ రేటు సాధిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 4 కోట్ల 2 లక్షల 396 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో రెండు కోట్ల పైచిలుకు బీసీ ఓటర్లు ఉన్నారు. అందునా.. మహిళల ఓట్లు 2 కోట్ల 2 లక్షల 18 వేలు ఉన్నాయి. ఇక, ఈ మొత్తం ఓటర్లలో మైనారిటీలు.. క్రిస్ట్రియన్లు, సిక్కులు, ముస్లింలు, ఇతర వర్ణాలు కలిపి 2 లక్షల ఓట్లు ఉన్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న వైసీపీ.. ఆయా వర్గాల ఆశలను పదిలం చేసేందుకు వారి యాస్పిరేషన్లు తీర్చేందుకు నడుం బిగించింది.
నిజానికి ఇదొక చరిత్రాత్మక విషయమనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ దాదాపు 35 నుంచి 40 శాతం వర కు మహిళలకే టికెట్లు ఇవ్వనుందని తెలిసింది. దీనికి సంబంధించి ముమ్మర కసరత్తు కూడా ప్రారంభిం చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారినే కాదు.. అట్టడుగు వర్గాల నుంచి కూడా .. కొందరిని(ఇప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నవారిని కూడా) ఎంపిక చేసి.. వారికి టికెట్లు ఇవ్వనుంది. పలితంగా అసెంబ్లీలో అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం పెరగనుంది.
ఇక, మైనారిటీలకు కూడా.. మరింత మేలు చేయాలనే తలంపుతో.. మైనారిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాల కు చెందిన నాయకులను పక్కన పెట్టి మరీ.. వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదేసమయంలో బీసీలు ఓట్లు ఎక్కువగా ఉండడంతోపాటు.. వారికి అనేక ఆలోచనలు, ఆశలు ఉన్న నేపథ్యంలో దాదాపు 50 నుంచి 55 శాతం టికెట్లు బీసీలకే ఇచ్చే దిశగా జగన్ పార్టీ అడుగులు వేస్తోంది. జనాభా దామాషా పద్ధతిలో సీట్లను కేటాయించడంద్వారా.. ఆయా వర్గాలకు మేలు జరుగుతుందన్న కీలక నిర్ణయం దిశగా జగన్ అడుగులు వేస్తుండడం గమనార్హం.