వైసీపీ కొత్త ఇన్ ఛార్జ్ లకు సీట్లు లేవా?

ప్రస్తుతం అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు అనే కార్యక్రమం అత్యంత ఆసక్తిగా జరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2024-01-23 11:30 GMT

ప్రస్తుతం అధికార వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు అనే కార్యక్రమం అత్యంత ఆసక్తిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో ఆ పార్టీ అధిష్టాణం నాలుగు విడతలుగా నాలుగు జాబితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా 10 పార్లమెంట్ స్థానాలకు, 58 లోక్ సభ స్థానాలకూ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు జరిగాయి. ఈ క్రమంలో ఐదో విడతగా ఐదో జాబితా సిద్ధమవుతుందని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను జగన్ పిలిపించుకుని మాట్లాడారని తెలుస్తుంది.

ఇదే సమయంలో ఐదో జాబితానే ఫైనల్ అనే చర్చ కూడా నడుస్తుంది. ఈ ఐదో జాబితాతోనే ఇన్ ఛార్జ్ ల మార్పులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో మార్పులు జరుగుతున్న చోట... కొత్తగా అవకాశం దక్కించుకున్నవారినీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనూ జగన్ పిలిచి మాట్లాడుతున్నారు! ఇందులో భాగంగా... ఎన్నికల్లో కలిసి పని చేయాలని నేతలకు సూచిస్తున్నారు.

మరోపక్క... ఫైనల్ జాబితా వెలువడిన అనంతరం వైసీపీలో తీవ్ర గందరగోల పరిస్థితులు నెలకొనే ప్రమాదం లేకపోలేదనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటినుంచి పార్టీకి విధేయులుగా ఉంటూ పనిచేస్తున్న తమకు ఈ సమయంలో హ్యాండ్ ఇవ్వడం భావ్యం కాదని వారు వాపోతున్నారని తెలుస్తుంది. అయినప్పటికీ... తాను చెప్పాలనుకున్నది చెప్పి జగన్ వారిని సాగనంపుతున్నారని సమాచారం.

ఈ సమయంలో ఇప్పటికే ఇన్ ఛార్జ్ లుగా ప్రకటించబడని నేతల్లో కొంతమంది బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కగా.. మరికొంతమంది వారి వారి అనుచరులను గిల్లి వదులుతున్నారు! ఇంకొంతమంది ఇప్పటికే పక్క పార్టీల జెండాలు కప్పుకుని.. సీట్లు రిజర్వ్ చేసేసుకున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో... అధికార పార్టీలో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పుల సంగతి అలా ఉంటే... ఇప్పుడు ఎంపిక కాబడిన నేతల్లో కొంతమంది కొత్త ఇన్ ఛార్జ్ లే తప్ప అభ్యర్థులు కాదనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీ రాజకీయాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణలో సిట్టింగులను మార్చకపోవడం వల్ల కేసీఆర్ ఓటమిపాలయ్యారని కథనాలొచ్చిన వేళ... జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరంటే... ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడంతోపాటు.. సక్రమంగా చేయకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి సీనియర్లు అభిప్రాయపడ్డారు.

ఈ సమయంలో సర్వేల ఫలితాలు, సామాజిక సమీకరణలు, కార్యకర్తల సూచనలు, నేతల పనితీరు మొదలైన విషయాలను ప్రాతిపదికగా తీసుకుని ఆయా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తున్నట్లు జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కొత్తగా ఇన్ ఛార్జ్ ల ఎంపిక అనంతరం కూడా కొంతమంది నేతలపై ఈ గ్యాప్ లో సర్వే జరుగుతుందని అంటున్నారు.

ఈ మేరకు వైసీపీ అధిష్టాణం కొత్తగా ఎంపికైన ఇన్ ఛార్జ్ ల పనితీరుపైనా సర్వేలు చేపట్టిందని... వారి వారి పెఫార్మెన్స్ లను బట్టి టిక్కెట్ల కన్ ఫర్మేషన్ ఉంటుందని.. ఆ సర్వేల్లో పాజిటివ్ ఫలితాలు రాని నేపథ్యంలో... పలువురు కొత్త ఇన్ ఛార్జ్ లను సైతం టిక్కెట్లు కన్ ఫాం చేసే ముందు కూడా మార్చే అవకాశం ఉందని అంటున్నారు! అయితే అది సర్వేల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. సర్వేల్లో పాజిటివ్ ఫలితాలు వస్తే సమస్యే లేదు! దీంతో... ఎన్నికలు అయ్యే వరకూ పలువురు కొత్త ఇన్ ఛార్జ్ లకు టిక్కెట్లు కన్ ఫాం చేయించుకోవడం అనేది కత్తిమీద సామే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి

Tags:    

Similar News