ఫ్యాన్ పార్టీ కేరాఫ్ త్రీ సిటీస్...అయిదేళ్ళూ అక్కడేనట ?

వైసీపీ భారీ ఓటమి తరువాత నియోజకవర్గ స్థాయి నేతలు అయితే ఏపీలో ఉండడం లేదు అన్న ప్రచారం ఉంది.

Update: 2024-08-05 00:30 GMT

వైసీపీ భారీ ఓటమి తరువాత నియోజకవర్గ స్థాయి నేతలు అయితే ఏపీలో ఉండడం లేదు అన్న ప్రచారం ఉంది. జూన్ 4న ఫలితాలు వచ్చిన తరువాత వైసీపీ రాజకీయ జాతకం తేలిన తరువాత నూటికి తొంబై శాతం వైసీపీ లీడర్లు ఏపీకి దూరం జరిగారు అన్నది పార్టీలో టాక్ నడుస్తోంది.

అందుకే వైసీపీ క్యాడర్ మీద గ్రౌండ్ లెవెల్ లో రాజకీయ దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు కనిపించడం లేదు అని అంటున్నారు. పార్టీలో కీలక పదవులు అనుభవించి అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు సైతం ఇపుడు రాష్ట్రం దాటేసి వెళ్లిపోయారు అని అంటున్నారు.

ఏపీలో భారీ మెజారిటీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. బిగిసి అయిదేళ్ళ కాలం ఉంది. ఈ మధ్యలో రాజకీయంగా ఏమి చేయడానికి లేదు. అలాగే హవా చెలాయించడానికి అసలు కుదరదు. దాంతో ఏపీలోని మూడు రీజియన్లకు చెందిన వైసీపీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న మెగా సిటీలకు మకాం మార్చేశారు అని అంటున్నారు.

ముఖ్యంగా చూస్తే రాయలసీమ జిల్లాలకు చెందిన వారు అంతా బెంగళూరు లో సెటిల్ అయ్యారని అంటున్నారు. అక్కడే అద్దెకు భవనాలు తీసుకుని తన నివాసాలను మార్చేశారు అని అంటున్నారు. ఇక నెల్లూరు ఆ సమీపంలో ఉన్న ప్రాంతాలకు చెందిన నేతలు అంతా బెస్ట్ ప్లేస్ గా చెన్నై ని ఎంచుకున్నారు అని అంటున్నారు. చెన్నైలో వారు కూడా అయిదేళ్ల పాటు ఉండేందుకు సరిపడా అన్నీ సమకూర్చుకుని కేరాఫ్ అడ్రస్ ని చేంజ్ చేశారు అని అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రా కోస్తా జిల్లాలకు చెందిన నాయకులు అత్యధిక శాతం హైదరాబాద్ కి చాయిస్ గా మార్చుకున్నారు అని అంటున్నారు. ఇలా ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గలలో చూస్తే మెజారిటీ నేతలు అంతా ఈ మూడు మెగా సిటీలలో సర్దుకున్నారు అని ప్రచారం సాగుతోంది. మరి వీరంతా అక్కడ ఏమి చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనే ఎక్కువ మంది ఉంటారని అంటున్నారు.

అలా అయిదేళ్ళ కాలం ఈ బిజినెస్ ని చేస్తూ ఆర్ధికంగా అన్ని విధాలుగా తాము గట్టిగా నిలదొక్కుకున్న తరువాతనే తిరిగి 2029 ఎన్నికలకు ముందు వచ్చి రాజకీయ హడావుడిని మొదలెడతారు అని అంటున్నారు. అలా వచ్చే వారు అంతా వైసీపీకే విధేయులుగా ఉంటారన్న నమ్మకం కూడా లేదు అని అంటున్నారు.

అప్పటికి రాజకీయ పరిస్థితి ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ వైపునకు జంప్ అవడానికి కూడా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు అని అంటున్నారు. అలా చూస్తే కనుక వైసీపీ ఏపీలో పూర్తిగా నాధుడు లేని నియోజకవర్గాలతో ఎక్కువగా కనిపిస్తోంది అని అంటున్నారు. గతంలో అయితే పార్టీ ఓటమి పాలు అయినా నియోజకవర్గాన్ని అట్టే బెట్టుకుని ఉండేవారు.

తమ సొంత సొమ్ము వెచ్చించి మరీ పార్టీని క్యాడర్ ని కాచుకునేవారు. కానీ ఇపుడు ఆలా లేదు అంతా ఆటోమేటిక్ గానే జరిగిపోవాల్సిందే అంటున్నారు. ఇలా వచ్చామా టికెట్ కొట్టామా గెలిచామా అన్నట్లుగానే రాజకీయం ఉండాలని ఈ తరం భావిస్తోంది. ఒకవేళ ఓటమి పాలు అయితే మళ్ళీ తమ బిజినెస్ లు చేసుకోవడానికే మొగ్గు చూపే వారు ఎక్కువ మంది ఉన్నారు.

కమిటెడ్ గా పార్టీ కోసం పనిచేసే వారు తగ్గిపోతున్నారు. అందులోనూ టీడీపీ బీజేపీ వంటి పార్టీలను పక్కన పెడితే ఎమోషనల్ టచ్ తో ఏర్పడిన వైసీపీ లాంటి పార్టీలలో సంస్థాగతంగా నిర్మాణం గట్టిగా లేకపోతే ఇవే ఇబ్బందులు అని అంటున్నారు. టీడీపీ 2019లో ఓటమి పాలు అయినప్పుడు కూడా సీనియర్లు బయటకు రాకపోయినా జూనియర్లు అయినా పార్టీ కోసం ముందుకు వచ్చారు.

మరి వైసీపీ విషయంలో ఆ పరిస్థితి ఉంటుందా అన్న చర్చ సాగుతోంది. అధికారంలో ఉంటే రాజకీయం ఫుల్ టైం అని లేకపోతే లాంగ్ లీవ్ అన్నట్లుగా సాగుతున్న నయా పాలిటిక్స్ లో వైసీపీ అయిదేళ్ల పాటు ఎలా ముందుకు సాగుతుంది, టీడీపీ కూటమిని తట్టుకుని ఎలా జనంలోకి వెళ్ళి నిలుస్తుంది అన్నది చర్చగా ఉంది.

Tags:    

Similar News