సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. చట్టం అందరు సమానమే
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు ఆమెను వారం రోజులుగా అరెస్ట్ చేసి సెల్ లో వేసింది.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కుంభకోణంలో ఈడీ అధికారులు ఆమెను వారం రోజులుగా అరెస్ట్ చేసి సెల్ లో వేసింది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. కానీ అక్కడ ఆమెకు ఊరట లభించలేదు కదా షాకే తగిలింది. కవిత వేసిన రిట్ పిటిషన్ కు సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చడం విశేషం.
రాజకీయ నాయకులైనంత మాత్రాన?
రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండదని కోర్టు స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరికైనా ఒకే న్యాయం, ఒకే చట్టం ఉంటుంని తెలియజేసింది. జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సుంద్రేష్, జస్టిస్ బేల త్రివేదితో కూడాన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కవిత వేసిన రిట్ పిటిషన్ లో లేవనెత్తిన అంశాలను విజయ్ మదన్ లాల్ కేసుతో కలిపి విచారణ చేస్తామని తెలిపింది.
చట్టం ముందు అందరు సమానులే
చట్టం ముందు అందరు సమానులే. రాజకీయ నాయకులైతే ప్రత్యేకంగా విచారణ చేయడం ఉండదు. ట్రయల్ ఎదుర్కోవాల్సిందే. కవిత వేసిన రిట్ పిటిషన్ కు సంబంధించి ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేయడం విశేషం. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పాటించి కేసుకు సహకరించాల్సిందేనని తెలియజేసింది.
మహిళ అనే కోణంలో..
కవిత మహిళ కావడంతో ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్రపై సాధ్యమైనంత త్వరగా తీర్పు వెలువరించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కవిత కేసును తొందరగా తేల్చాలని సూచించింది. మహిళ అనే భావంతో ఆమెపై ఉన్న ఆరోపణల్లో నిజమెంతో నిగ్గు తేల్చాలని సూచించింది.
కేజ్రీవాల్ అరెస్టుతో..
కేసులో ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ అరెస్ట్ తో కొత్త మలుపులు తిరుగుతోంది. కవిత మెడకు కూడా ఉచ్చు బిగుసుకుంటుందా అనే కోణంలో అనుమానాలు వస్తున్నాయి. ఊహించని విధంగా కేసు ముందుకెళ్తుండటంతో సుప్రీం ధర్మాసనం తన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయిస్తుందా? కేసులో ఉపశమనం దొరుకుతుందా? అనే కోణంలోనే పలు ప్రశ్నలు రావడం సహజమే.