బెయిల్ పిటిషన్ పై కవిత సంచలనం నిర్ణయం..? ఎందుకిలానో?

సోమవారం కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణకు సీనియర్ న్యాయవాది హాజరుకాలేదు.

Update: 2024-08-06 06:08 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి నాలుగు నెలలకు పైగా తిహాడ్ జైలులో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఎప్పుడొస్తుందా? అని ఆ పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఒక మాజీ ఎంపీ అయిన కవితకు లోక్ సభ ఎన్నికల వంటి అత్యంత కీలక సమయంలోనూ బెయిల్ దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, ఆ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం, లిక్కర్ కేసులో ప్రధాన పాత్రధారి అని ఆరోపిస్తున్న కేజ్రీవాల్ కు మాత్రం బెయిల్ లభించింది. అదంతా పక్కనపెడితే.. కవితకు ఈసారి మాత్రం బెయిల్ పక్కా అనే అభిప్రాయం ఉంది.

సోమవారం హాజరుకాని న్యాయవాది

సోమవారం కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణకు సీనియర్ న్యాయవాది హాజరుకాలేదు. దీంతో విచారణను వాయిదా వేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేనందున విచారణను మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ ప్రకారం బుధవారం కవిత బెయిల్ పిటిషన్‌ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఇందులో కవిత బెయిల్ రావడం పక్కా అని బీఆర్ఎస్ నేతలు భావించారు. నిర్దేశిత 60 రోజుల గడవులో పూర్తి స్థాయి చార్జిషీట్‌ దాఖలులో సీబీఐ విఫలం కావడమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఈ మేరకు గత నెల 8న కవిత న్యాయవాదులు వాదనలు వినిపించారు. కవితను ఏప్రిల్‌ 11న సీబీఐ అరెస్ట్‌ చేయగా, ఈడీ కేసులోనూ ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌ ను ఆగస్టు 13వరకు పొడిగించారు. ఇక ఇంతలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం జరిగింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత.. ఆ పిటిషన్‌ ను విత్‌డ్రా చేసుకున్నారు. ఇది అనూహ్య పరిణామమే. కేసులో పదేపదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారని.. దీంతో కవిత తరఫు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ ను విత్‌ డ్రా చేసుకున్నారని తెలుస్తోంది.

నాలుదు నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న కవితను అన్న కేటీఆర్, బావ హరీశ్రావు సహా ఇప్పటికే పలువురు నేతలు పలుసార్లు కలిశారు. బీఆర్ఎస్ మహిళా మాజీ మంత్రులూ వెళ్లి ధైర్యం చెప్పారు. కేటీఆర్, హరీశ్ మళ్లీ ఢిల్లీ వెళ్లారు. మంగళవారం కవితతో ములాఖత్ కానున్నారు.

Tags:    

Similar News