అందాల విరిబోణి.. కృతి కర్బందా
'బోణీ' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కృతి కర్బంద.
'బోణీ' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కృతి కర్బంద. తన మూడో సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ లాంటి సినిమాలతో మెప్పించింది. కన్నడ ఇండస్ట్రీ స్టార్ హీరోల చిత్రాల్లోనూ నటించింది. రాణించింది.
కానీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అదృష్టం లేక.. స్టార్ స్టేటస్ రుచి చూడలేకపోయింది. అయితే ఈ అమ్మడు ఇక్కడ అడపాదడపా చిత్రాలే చేసినప్పటికీ.. హిందీలో మాత్రం బాగానే వరుస అవకాశాలను దక్కించుకుంది. అలా హిందీ కెరీర్ కాస్త స్వింగ్‌లో ఉన్నప్పుడు.. గ్లామర్ గేట్లను ఎత్తేసి అందాల ప్రదర్శన గట్టిగానే చేసింది. నో లిమిట్స్ అంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో యూత్‌లో హీట్ పెంచేసింది.
దీంతో సోషల్‌మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగానే పెరిగిపోయింది. ప్రస్తుతం 8.1 మిలియన్స్ ఉన్నారు. అలా ఫాలోవర్స్ పెరిగేకొద్దీ తనలోని అందాలను రోజు రోజుకు పెంచుకుంటూ చూపిస్తూ పోయింది. తాజాగా మరోసారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫోటోస్‌ను షేర్ చేసింది. పర్పుల్ కలర్ మోడ్రన్ ఔట్ఫిట్ డిజైనెడ్ లెహంగాలో ఎద అందాలను చూపిస్తూ పోజిలిచ్చింది.
అలాగే నడుము, నాభి అందాలను కూడా కవ్వించింది. తన బాడీలోని ఒంపులసొంపులను బాగా చూపించింది. ఒక ఫొటోలో క్లోజప్ షాట్లో హాఫ్ బాడీ, మరో పిక్‌లో ఫుల్ సైజ్ బాడీ అందాలను చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. లూస్ హెయిర్, ఆమె ధరించిన సింపుల్ జ్యూవెలరీ కూడా మంచి అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు.. మోడ్రన్ అయినా ట్రెండ్ అయినా కృతి అందం ఎప్పుడు సూపరే అంటూ కామెంట్లు పెట్టారు.
ఇకపోతే ఈ అమ్మడు.. చివరిసారిగా 2021లో 14 ఫేరే సినిమాలో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనపడలేదు. టెలివిజన్ షోస్‌లో చివరిసారిగా 2019లో కనిపించింది. ప్రస్తుతం హిందీ యాక్టర్ పులకిత్ సామ్రాట్‌తో రిలేషన్ షిప్లో ఉంది.