పవన్ పాలిటిక్స్.. డైనమిక్ లుక్ లో మాస్ ఎంట్రీ

ఓ వైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తూనే.. మరోవైపు జనాల కోసం రాజకీయాల్లో కొనసాగుతూ తీరిక లేకుండా ఉంటున్నారు పవర్ స్టార్, జనసేన అధినేత పనవ్ కల్యాణ్‌.

Update: 2023-09-16 12:00 GMT

ఓ వైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తూనే.. మరోవైపు జనాల కోసం రాజకీయాల్లో కొనసాగుతూ తీరిక లేకుండా ఉంటున్నారు పవర్ స్టార్, జనసేన అధినేత పనవ్ కల్యాణ్‌. ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌ వల్ల బిజీ షెడ్యూల్స్‌తో ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్లాన్స్ రెడీ చేసుకుని ముందుకెళ్తున్నారు. అయితే తాజాగా జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అక్కడ ఆయన డైనమిక్ లుక్ అదిరింది.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ కు మద్దతుకు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఆయనకు మద్దతు పలుకుతూ.. వచ్చే ఎన్నికల్లో తేదేపాతో కలిసి ముందుకు వెళ్లనున్నట్లు ఇటీవలే అధికారికంగా కూడా ప్రకటించారు.

అందుకు తగ్గట్టుగా కార్యచరణ సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు పవన్. అయితే ఆయన.. జనసేన కార్యకలాపాలను మంగళగిరి కేంద్రంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఇంత ఉద్రిక్త పరిస్థితిలోనూ ఆయన రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి ఉస్తాద్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలోని జైలులో ఉన్న చంద్రబాబును పరామర్శించారు. ఇప్పుడాయన మళ్లీ తన రాజకీయ కార్యచరణపై ఫోకస్ పెట్టారు. తాజాగా జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

అక్కడ నుంచి ఆయన కార్యలయానికి కారులో వెళ్లిపోయారు. అయితే ఎయిర్ పోర్ట్ లో పవన్ డైనమిక్ లుక్ లో కనిపించారు. ఆయన ఎంట్రీ అదిరిపోయింది. టాప్ టు బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయారు. బ్లాస్ షూస్, జీన్స్, జిప్ షర్ట్, కూలింగ్ గ్లాసెస్ ధరించి.. ఆయన నడుస్తూ వెళ్తుంటే మాములుగా లేదు. చుట్టూ ఉన్న భద్రత సిబ్బంది మధ్యలో నుంచి ఆయన నడుస్తూ వెళ్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలలేదనన్నట్టుగా అనిపించింది. ఇక జనసేన విస్తృత స్థాయి సమావేశంలో .. ఏపీలో పార్టీని మరింత బ‌లోపేతం చేయ‌డం, వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాడ‌డం సహా చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించిన వంటి అంశాల‌పై చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News